Salaar Collections : ఆరు రోజుల్లో సలార్ కలెక్షన్స్ ఎంతంటే..

సలార్ నిర్మాతలు ఆరు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలియజేశారు.;

Update: 2023-12-28 06:42 GMT
Prabhas, prashanth neel, Salaar, Salaar collections, movie news,  salaar updates
  • whatsapp icon
Salaar Collections : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రెండు పార్టులుగా తెరకెక్కిన 'సలార్' ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 'ఖాన్సార్' అనే ఒక అండర్ వరల్డ్ సిటీ సింహాసనం కోసం మూడు ట్రైబల్ ఫ్యామిలీస్ మధ్య జరిగే యుద్ధం నేపథ్యంతో ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఇక మూవీలో ప్రభాస్ మాస్ యాక్షన్ కి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్ధలవుతున్నయి.
ఫస్ట్ డేనే ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. ఇక రెండో రోజు దాదాపు 300 కోట్లు కోట్ల వరకు చేసుకున్న సలార్.. మూడో రోజు 400 కోట్ల మార్క్ ని దాటేసింది. తాజాగా ఈ చిత్రం 500 కోట్ల మార్క్ ని దాటినట్లు నిర్మాతలు తెలియజేశారు. ఆరు రోజుల్లో ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసిందని వెల్లడించారు. మొదటి వారం పూర్తి కాకుండానే 500 కోట్ల మార్క్ ని అందుకున్న ఈ చిత్రం.. త్వరలోనే 1000 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అనుకుంటా.

కాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. దీనిబట్టి చూస్తే, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 700 కోట్ల పై గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. అంటే ఈ చిత్రం మరో 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటే చాలు బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే.

Tags:    

Similar News