టీవీ ఛానెల్ పెడుతున్న ప్ర‌భాస్‌..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు. దీంతో ప్ర‌భాస్ ఏం చేసినా సెన్సేషన్ లానే ఉంటుంది. అటువంటి ప్రభాస్ [more]

Update: 2019-05-16 08:38 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ తో నేషనల్ వైడ్ పాపులర్ అయ్యాడు. దీంతో ప్ర‌భాస్ ఏం చేసినా సెన్సేషన్ లానే ఉంటుంది. అటువంటి ప్రభాస్ పైన లేటెస్ట్ గా ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ప్రభాస్ త్వరలో తన స్నేహితులతో కలిసి ఓ టీవీ ఛానల్ ప్రారంభించబోతున్నారట. దీని గురించి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు కానీ వార్త‌లైతే ప్ర‌చారంలోకి వ‌చ్చాయి.

న్యూస్ ఛానెలా ? ఎంట‌ర్టైన్మెంటా..?

రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బిజినెస్ మాగ్నెట్స్ టీవీ ఛానెల్స్ ప్రారంభిస్తూ ఉంటారు. మరి ప్రభాస్ ఏ ఉద్దేశ్య‌తో ఛానల్ పెడుతున్నాడో అర్ధం కానీ విషయం. ఐతే ఇది న్యూస్ ఛానెలా లేదా ఎంటర్టైన్మెంట్ ఛానెలా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం “సాహో” షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకోనుంది. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది.

Tags:    

Similar News