Prakash raj : “మా” కు రాజీనామా చేస్తున్నా.. అతిధిగానే ఉంటా

తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. తాను ఇక ఇక్కడ అతిధిగానే ఉంటానని చెప్పారు. తనకు మా తో 21 [more]

Update: 2021-10-11 05:47 GMT

తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. తాను ఇక ఇక్కడ అతిధిగానే ఉంటానని చెప్పారు. తనకు మా తో 21 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఫలితాలను బట్టి తనను నాన్ లోకల్ గా గుర్తించారని ప్రకాష్ రాజ్ చెప్పారు. నా తల్లిదండ్రులు తెలుగువారు కాదు. కానీ అదినేను చేసిన తప్పు కాదు గదా? అని ఆయన ప్రశ్నించారు. తాను ఇకపై అతిధిగానే కొనసాగుతానని చెప్పారు. తనపై ప్రాంతీయ వాదం, జాతీయవాదాన్ని రుద్దడం బాధించిందని ప్రకాష్ రాజ్ చెప్పారు.

Tags:    

Similar News