గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ ప్రణీత

ప్రణీత సుభాష్‌ దంపతులు ఆడబిడ్డకు స్వాగతం పలికారు. తన ప్రసవం సమయంలో మద్దతుగా నిలిచిన

Update: 2022-06-10 15:19 GMT

నటి ప్రణీత సుభాష్ గుడ్ న్యూస్ చెప్పింది. తనకు ఆడబిడ్డ పుట్టిందని సోషల్ మీడియాలో తెలిపింది. ప్రణీత సుభాష్‌ దంపతులు ఆడబిడ్డకు స్వాగతం పలికారు. తన ప్రసవం సమయంలో మద్దతుగా నిలిచిన వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. 'పాప పుట్టినప్పటి నుంచి అంతా కలగా అనిపిస్తోంది. నాకు గైనకాలజిస్ట్‌ అయిన తల్లి ఉండటంం నిజంగా నా అదృష్టం. కానీ మానసికంగా మాత్రం ఆమెకు ఇది చాలా కష్ట సమయం. డాక్టర్‌ సునీల్‌ ఈశ్వర్‌, అతడి టీమ్‌ డెలివరీ సవ్యంగా జరిగేలా చూశారు. అలాగే డాక్టర్‌ సుబ్బు, అతడి బృందానికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ స్టోరీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాను' అంటూ ఆమె పోస్టు పెట్టారు.

గతేడాది మే30న వ్యాపార వేత్త నితిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రణీత సుభాష్. కరోనా కారణంగా తన వివాహాన్ని అత్యంత సన్నిహితుల మధ్య చేసుకుంది. కరోనా నేపథ్యంలో రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలియజేశారు.తెలుగులో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)వంటి టాప్ స్టార్స్ పక్కన ప్రణీత నటించారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఆమె హిందీలో కూడా చిత్రాలు చేశారు. ప్రణీత హీరోయిన్ గా నటించిన హంగామా 2, బుజ్ చిత్రాలు విడుదలయ్యాయి. హిందీలో కూడా ఆమె స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయారు. గర్భవతి అయ్యాక ప్రణీత పలు విషయాలను రెగ్యులర్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.


Tags:    

Similar News