Prashanth Neel : నాకున్న సమస్య వలనే సలార్ కూడా అలా వచ్చింది..

తనకి ఉన్న ఓ సమస్య వలనే సలార్ ని కూడా అలా చిత్రీకరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటి..?;

Update: 2023-12-19 06:58 GMT
Prashanth Neel, Prabhas, Salaar, Salaar movie in his recent interview, salaar updates

 Salaar movie in his recent interview

  • whatsapp icon

Prashanth Neel : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ పార్ట్ 1 ఈ నెల 22న రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న ప్రశాంత్ నీల్.. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అక్కడ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి ఉన్న ఓ సమస్య వలనే సలార్ ని కూడా అలా చిత్రీకరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటి..? సలార్ ని ఎలా చిత్రీకరించారు..?

ప్రశాంత్ నీల్ తన కెరీర్ లో ఇప్పటి వరకు డైరెక్ట్ చేసింది కేవలం మూడు సినిమాలే. ఉగ్రమ్, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చిత్రాలు తరువాత ఇప్పుడు సలార్ సిరీస్ తో వస్తున్నారు. అయితే ఈ అన్ని సినిమాలను గమనిస్తే.. డార్క్ మోడ్ లో కనిపిస్తాయి. ఎక్కువ కలర్స్ లేకుండా మట్టి, మసితో డార్క్ గా సినిమాలు కనిపిస్తుంటాయి. ఇలా డార్క్ గా చూపించడానికి గల కారణం తనకి ఉన్న ఒక సమస్యే అని ప్రశాంత్ నీల్ తెలియజేశారు. తనకి కలర్ OCD (Obsessive compulsive disorder) సమస్య ఉందట.
తనకి ఎక్కువ కలర్స్ ఉంటే నచ్చదట. అందుకనే తన సినిమాలో కనిపించే లొకేషన్స్, కాస్ట్యూమ్స్, ఫ్రేమ్స్ అన్ని డార్క్ మోడ్ లోనే ఉంటాయని చెప్పుకొచ్చారు. కాగా సలార్ తరువాత ఎన్టీఆర్ తో చేయబోయే NTR31 అనౌన్స్ పోస్టర్ ని కూడా బ్లాక్ థీమ్ లోనే రిలీజ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఇదే ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. 'కేజీఎఫ్‌లో చేసిన తప్పులే సలార్‌లో కూడా చేశాను' అంటూ చెప్పుకొచ్చారు.
ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే.. "కేజీఎఫ్ విషయంలో నేను ఫైనల్ కట్ రెడీ చేసిన తరువాత దానిని ఒకసారి చూసి.. ఏమన్నా చేంజస్ చేయాలా అని తెలుసుకోవడానికి సమయం కేటాయించలేకపోయాను. సలార్ లో కూడా అదే తప్పుని రిపీట్ చేశాను. అయినాసరి నేను ఆ ఫైనల్ కట్ పై ఆనందం గానే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.



Tags:    

Similar News