The Goat Life OTT: హమ్మయ్య ఆ సినిమా ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ అయింది

నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.. సలార్, ది గోట్ లైఫ్ వంటి టో బ్యాక్ టు బ్యాక్ హిట్‌ల తర్వాత;

Update: 2024-07-14 08:20 GMT

నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్.. సలార్, ది గోట్ లైఫ్ వంటి టో బ్యాక్ టు బ్యాక్ హిట్‌ల తర్వాత బాక్సాఫీస్ వద్ద 'బడే మియాన్ చోటే మియాన్‌' సినిమాతో పరాజయాన్ని చవిచూశాడు. రెండు సినిమాలు కలెక్షన్ల కౌంటర్లో సూపర్‌హిట్ అయితే, ఓటీటీలో సలార్ మంచి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు విడుదలైన దాదాపు నాలుగు నెలల తర్వాత 'ది గోట్ లైఫ్' సినిమా ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారు. సినిమా విడుదలకు దాదాపు 16 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఆ సినిమా OTT లోకి కూడా వచ్చేస్తోంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'గోట్ లైఫ్' సినిమా జూలై 19న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ చిత్రం 5 భాషల్లో అదే రోజున అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌డేట్‌ లో తెలిపారు. "A story of courage, hope, and survival. Idhu Najeebinte athijeevana katha. #Aadujeevitham is coming to Netflix on 19 July in Malayalam, Tamil, Telugu, Kannada and Hindi!" అంటూ నెట్ ఫ్లిక్స్ ఇండియా ట్వీట్ వేసింది. గోట్ లైఫ్ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ది గోట్ లైఫ్ సినిమా మలయాళ సాహిత్య ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన బెస్ట్ సెల్లర్ నవల 'ఆడుజీవితం' ఆధారంగా రూపొందించారు. ప్రముఖ రచయిత బెంజమిన్ రాసిన నవల. నజీబ్ అనే యువకుడి జీవితానికి సంబంధించిన కథ ఈ సినిమా.



Tags:    

Similar News