రష్మిక జోరుకి బ్రేకులు వేసిన అప్ కమింగ్ బ్యూటీ?

ఛలో అంటూ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న చాలా తక్కువ సమయంలోనే టాప్ స్టార్స్ కి జోడి కట్టేస్తూ టాలీవుడ్ లో [more]

Update: 2021-01-23 03:27 GMT

ఛలో అంటూ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న చాలా తక్కువ సమయంలోనే టాప్ స్టార్స్ కి జోడి కట్టేస్తూ టాలీవుడ్ లో పాగా వేసింది. అల్లు అర్జున్ తో పాన్ ఇండియా ఫిలింలో నటిస్తున్న రష్మిక.. బాలీవుడ్ మూవీస్ తోనూ బాగా బిజీ అయ్యింది. తెలుగులో పూజ హెగ్డే తో నువ్వా నేనా అంటున్న రశ్మికకి కోలీవుడ్ ఆఫర్స్ కూడా తలుపుతడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ జోరు మీదున్న రశ్మికకి ఇప్పుడు ఒక హీరోయిన్ చుక్కలు చూపిస్తుంది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. 
ఆమె ఎవరో కాదు… తెలుగులో నేచురల్ స్టార్ నాని తో గ్యాంగ్ లీడర్ లో నటించిన ప్రియాంక అరుల్ మోహ‌న్. ఇప్పడు కోలీవుడ్ లో ప్రియాంక అరుల్ మోహ‌న్ జోరు బాగా ఉందట. తెలుగులోనూ బిజీ తారగా ఉన్న ప్రియాంక ఇప్పుడు రష్మిక కోలీవుడ్ ఆఫర్ ని తన్నుకుపోయినట్లుగా కోలీవడో మీడియాలో వినిపిస్తున్న న్యూస్. స్టార్ హీరో సూర్య ఆకాశమే నీ హద్దురా సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. అందులో సూర్య సరసన రశ్మికాని ఎంపిక చేసినట్లుగా ఆ మధ్యన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చెయ్యగా.. తాజాగా సూర్యకి జోడిగా ప్రియాంక అరుల్ మోహ‌న్ అవకాశం దక్కించుకున్నట్టుగా టాక్. మరి టాప్ రేంజ్ హీరోయిన్ రశ్మికాని ఎందుకు తప్పించాల్సి వచ్చింది అంటే.. ఆమె అడిగిన పారితోషకం ఒక కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న రశ్మికకి ఓ అప్ కమింగ్ హీరోయిన్ షాకివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News