మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ నిర్మాత ఈ విధంగా క్లారిటీ ఇచ్చాడు!!

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాని జులై 30 న విడుదల చేద్దామనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్స్ వలన సినిమా ని జనవరి 8 2020 కి [more]

Update: 2020-05-16 04:11 GMT

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాని జులై 30 న విడుదల చేద్దామనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్స్ వలన సినిమా ని జనవరి 8 2020 కి పోస్ట్ ఫోన్ చేసారు. అయితే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎలాగోలా పూర్తి చేసి సినిమాని జనవరి 8 కి ఖచ్చితంగా తీసుకువద్దామని అనుకుంటే.. తాజాగా కరోనా లాక్ డౌన్ మల్లి ఆర్ ఆర్ ఆర్ ప్లానింగ్ మార్చేలా కనబడుతుంది. కనబడుతుంది కాదు.. ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల పక్క పోస్ట్ పోన్ అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఎన్టీఆర్, మెగా ఫాన్స్ ని బాగా డిస్పాయింట్ చేసింది.

కరోనా లాక్ డౌన్ కి ముందు ఆర్ ఆర్ ఆర్ ని ఎలాగైనా జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే అనుకున్నాము, అయితే లాక్ డౌన్ కారణంగా ప్లానింగ్ దెబ్బతింది. ఆర్ ఆర్ ఆర్ లో ఇంకా చిత్రీకరించవలసిన సన్నివేశాలు మిగిలే వున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడామిగిలే ఉన్నాయి.  అందువలన ముందుగా అనుకున్న సమయానికి ఈ సినిమాను విడుదల చేయలేము…. అని చెప్పడంతో ఆర్ ఆర్ ఆర్ మరోసారి పోస్ట్ ఫోన్ పక్క అని తేలింది. అయితే జనవరి 8 కి పోస్ట్ ఫోన్ అయినా సినిమా ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి రెండేళ్ల క్రితం ఏప్రిల్ 28 న బాహుబలి విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. మరి ఆర్ ఆర్ ఆర్ కూడా అదే లెవల్లో హిట్ అవుద్ది అనే సెంటిమెంట్ బయలుదేరడం ఖాయం.

Tags:    

Similar News