చిరంజీవి తో గొడవ పై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ – మెగాస్టార్ చిరంజీవి మధ్య విభేదాలున్నాయంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ తనకు, [more]
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ – మెగాస్టార్ చిరంజీవి మధ్య విభేదాలున్నాయంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ తనకు, [more]
దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ – మెగాస్టార్ చిరంజీవి మధ్య విభేదాలున్నాయంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ తనకు, చిరంజీవికి మధ్య ఎటువంటి విభేదాలు, గొడవలు లేవని స్పష్టం చేసారు. తమ్మారెడ్డి భరద్వాజకి ప్రత్యేకంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో సెలెబ్రెటీస్ ని ఇంటర్వ్యూ చేస్తూ… సినిమా రివ్యూస్ చెబుతుంటారు. అయితే చిరంజీవికి, తన మధ్య గొడవ గురించి ఆయన తన యూట్యూబ్ ఛానల్ లో క్లారిటీ ఇచ్చారు.
వ్యూస్ కోసం ఇలాంటివి వద్దు
‘‘నిన్న యూట్యూబ్‌లో ఓ వీడియో చూశా. నేను చిరంజీవిని ఏదో అన్నానని అందులో రిపోర్ట్ చేశారు. నాకు, చిరంజీవి గారికి ఎటువంటి విభేదాలు లేవు. నేను ఆయనను ఎప్పుడూ ఏమీ అనలేదు. నాకు ఎవరితోనూ అభిప్రాయభేదాలు లేవు. ఆయనతో విభేదాలు రావడానికి నేను ఎవర్ని? ఆయన ఎక్కడ? నేను ఎక్కడ? ఆయన స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటి? నేను ఓ సామాన్యుడిని. మీ ఛానల్ వ్యూస్ కోసం ఇలా రాయొద్దు. ఇది కరెక్ట్ కాదు’’ అని ఆయన చెప్పారు.