PSPK 27 రిలీజ్ ఎప్పుడంటే..

పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న విడుదల కాబోతుంది. దిల్ రాజు బ్యానేర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన [more]

Update: 2021-03-01 05:23 GMT

పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న విడుదల కాబోతుంది. దిల్ రాజు బ్యానేర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ రిలీజ్ కి సిద్ధమవుతుంటే.. ఆయన నటిస్తున్న మరో మూవీ అయ్యప్పన్ కోషియమ్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో PSPK 27 షూటింగ్ లో బిజీగా వున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ గజ దొంగగా నటిస్తున్న PSPK 27 టైటిల్ గా హరిహర వీరమల్లు ప్రచారం లో ఉండగా.. మహాశివరాత్రి రోజున పవన్ PSPK 27 టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చెయ్యబోతున్నారు. రీసెంట్ గా PSPK 27 మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది టీం. పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబో PSPK 27 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. దానితో పవన్ కళ్యాణ్ కి మహేష్ కి వార్ షురూ అయ్యింది. మహేష్ బాబు సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతికి కి విడుదల చేస్తామంటూ పరశురామ్ డేట్ లాక్ చేసి ముందుగానే గ్రాండ్ గా ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి 2021 సంక్రాంతికి వార్ షురూ అయ్యింది.

Tags:    

Similar News