బన్నీకి నచ్చనిది.. రౌడీకి ఎలా నచ్చిందో?

పూరి జగన్నాధ్ రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మాస్ హిట్ అవడంతో.. స్టార్ హీరోల చూపు పూరి మీద పడుతుందేమో అనుకున్నారు. అయితే పూరి [more]

Update: 2020-04-20 06:00 GMT

పూరి జగన్నాధ్ రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మాస్ హిట్ అవడంతో.. స్టార్ హీరోల చూపు పూరి మీద పడుతుందేమో అనుకున్నారు. అయితే పూరి కూడా స్టార్ హీరోలను ముఖ్యంగా మాస్ అప్పీల్ ఉన్న హీరోలను దృష్టిలో ఉంచుకునే ఓ కథని సిద్ధం చేసాడట, ఆ కథతో ముందుగా అల్లు అర్జున్ ని కలిసి తన దగ్గరున్న ఫైటర్ కథని పూరి నేరేట్ చెయ్యగా.. అల్లు అర్జున్ కి కథ నచ్చిందో.. లేదో.. తెలియదు కానీ.. కి పూరి జగన్నాధ్ కి అల్లు అర్జున్ నో చెప్పడంతో.. అదే కథని కాస్త అటు ఇటు మర్చి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కి వినిపించగా.. అప్పటికే డియర్ కామ్రేడ్ ప్లాప్ లో ఉన్న విజయ్ దేవరకొండ పైకి ఆ కథ నచ్చడంతో ఆ సినిమా పట్టాలెక్కింది.

అయితే విజయ్ దేవరకొండ ఆ కథని పాన్ ఇండియా లెవల్ లో ఉండాలని పూరి కి కండిషన్ పెట్టి,,.. మళ్ళీ ఫైటర్ కథని పాన్ ఇండియా లెవల్ కి మార్చడం… ఆ కథ విజయ్ కి నచ్చడంతో… అదే కథతో అటు బాలీవుడ్ లో కరణ్ జోహార్ ని మెప్పించి కరణ్ ని కూడా ఈ సినిమా లో ఇవాల్వ్ చేసాడు. అయితే తాజాగా ఈ ఫైటర్ కథని బన్నీ ఒప్పుకోకపోతే.. రౌడీ స్టార్ ఎలా ఒప్పుకున్నాడు. ఆ కథలో అంతగా విజయ్ దేవరకొండ కి నచ్చిందా… అంతగా నచ్చడానికి ఆ కథలో ఏముంది అంటూ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు షురూ అయ్యాయి.

Tags:    

Similar News