పూరీ ఫేట్ టర్న్ అవుతుందా..?
ప్రస్తుతం ఇండస్ట్రీలో పూరీ జగన్నాధ్ పరిస్థితి జీరో. ఎందుకంటే వరసగా ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయో లెక్కపెట్టి చెప్పడం కూడా కష్టమే. కనీసం యావరేజ్ కూడా లేకుండా [more]
ప్రస్తుతం ఇండస్ట్రీలో పూరీ జగన్నాధ్ పరిస్థితి జీరో. ఎందుకంటే వరసగా ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయో లెక్కపెట్టి చెప్పడం కూడా కష్టమే. కనీసం యావరేజ్ కూడా లేకుండా [more]
ప్రస్తుతం ఇండస్ట్రీలో పూరీ జగన్నాధ్ పరిస్థితి జీరో. ఎందుకంటే వరసగా ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయో లెక్కపెట్టి చెప్పడం కూడా కష్టమే. కనీసం యావరేజ్ కూడా లేకుండా డిజాస్టర్ అయిన సినిమాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అయినా ఈ డిజాస్టర్ డైరెక్టర్ కి ఎలాగోలా ఒక యావరేజ్ హీరో దొరికాడు. గత రెండు మూడు సినిమాలుగా యావరేజ్ లతో సరిపెట్టుకుంటున్న రామ్ పోతినేని పూరీకి అవకాశమిచ్చాడు. ఇక ఇదే పెద్ద విషయంగా ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటుంటే.. డిజాస్టర్ హీరోయిన్ ఛార్మి ఒకరు తయారయ్యారు. ఛార్మి… పూరీ కనెక్స్ లో పెట్టుబడులు పెడుతూ.. పూరీ ఆఫీస్ లోనే తిష్టవేసింది.
డిజాస్టర్ కాంబో గట్టెక్కుతుందా..?
మెహబూబా, పైసా వసూల్ డిజాస్టర్స్ తర్వాత ఛార్మి.. పూరి కనెక్ట్స్ కి దూరం అయ్యింది అనుకున్న వారికి మళ్లీ రామ్ సినిమాతో షాకిచ్చింది. నేను పూరీని వదలడమా అన్నట్లుగా పూరీ, రామ్ తో సెల్ఫీ దిగి మరీ జనాలకు షాకిచ్చింది. ఎలాగోలా రామ్ హీరోగా సినిమా మొదలెడదామనుకున్న పూరీకి ఇండస్ట్రీలో ఏ నిర్మాత సపోర్ట్ చెయ్యకపోయేసరికి మళ్లీ తానే నిర్మాతగా రామ్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం కాస్టింగ్ పనులు మొదలెట్టేసింది ఛార్మి. అయితే మెహబూబా కోసం ఇల్లు సైతం తాకట్టు పెట్టినట్లు ప్రచారం జరిగింది. ప్రస్తుతం పూరీ జగన్నాధ్ మాత్రం రామ్ కోసం కథ రెడీ చేసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యాడు. చూద్దాం ఈ డిజాస్టర్ కాంబో మీద ఎలాంటి అంచనాలు మొదలవుతాయి అనేది.