మరోసారి రంపచోడవరానికి పుష్ప టీం

పుష్ప పాన్ ఇండియా ఫిలిం షూటింగ్ సికింద్రబాద్ లో జరుగుతుంది. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న రష్మిక – అల్లు అర్జున్, పుష్ప విలన్ ఫహద్ [more]

Update: 2021-07-12 05:00 GMT

పుష్ప పాన్ ఇండియా ఫిలిం షూటింగ్ సికింద్రబాద్ లో జరుగుతుంది. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న రష్మిక – అల్లు అర్జున్, పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్, జబర్దస్త్ అనసూయ లాంటి వాళ్ళు పుష్ప షూట్ లో పాల్గొంటున్నారు. పుష్ప షూటింగ్ మొదలైనప్పుడు ఆంధ్ర లోని రంప చోడవరం అడవుల్లో షూటింగ్ చేసింది. అక్కడ అటవీప్రాంతంలోనే భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కి వచ్చేసింది టీం. అసలు సినిమా అంతా నల్లమల అడవుల బ్యాగ్డ్రాప్ లో చిత్రీకరించాల్సి ఉండగా.. కరోనా సిట్యువేషన్ తో రంప చోడవరం అడవులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప టీం హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకుని మరోసారి రంప చోడవరం అడవులకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ అటవీప్రాంతంలోనే భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేయబోతున్నారని తెలిసింది. దాదాపు ఈ షెడ్యూల్ నెల రోజుల పాటు జరగనుందని అంటున్నారు. మరి హైదరాబాద్ లో షూటింగ్ పూర్తికాగానే సుక్కు టీం మరోసారి ఆంధ్రాకి పయనమవ్వబోతుంది అని తెలుస్తుంది.

Tags:    

Similar News