పుష్ప కి 150 కోట్లు ..!

అల్లు అర్జున్ స్టామినా ఏంటో  అల వైకుంఠపురంలో కలెక్షన్స్ చూస్తే అర్ధం అవుతుంది. ఈమూవీ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా [more]

Update: 2020-05-10 04:10 GMT

అల్లు అర్జున్ స్టామినా ఏంటో  అల వైకుంఠపురంలో కలెక్షన్స్ చూస్తే అర్ధం అవుతుంది. ఈమూవీ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో మూడో స్థానంలో నిలిచింది. దాంతో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ విషయంలో ఎక్కడ రాజి పడకుండా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. నిర్మాతలు అల్లు అర్జున్ కలెక్షన్ ని దృష్టిలో పెట్టుకుని పుష్ప మూవీ ని చాలా రిచ్ గా తెరకెక్కించనున్నారని సమాచారం.

ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు ఏకంగా 6 కోట్ల బడ్జెట్ కేటాయించారట. సుకుమార్ ఈ ఫైట్ సీక్వెన్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా తీర్చిదిద్దనున్నారు. ఇక అడవిలో సాగే ఆ భారీ ఛేజింగ్ సన్నివేశం కోసం పెద్ద ఎత్తున వాహనాలు వాడనున్నారని సమాచారం. ఇక ఈమూవీ బడ్జెట్ కూడా 120-150 కోట్ల మధ్యలో ఉంటుందని వినికిడి. గతంలో బన్నీ సినిమాలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. ఏదిఏమైనా అల్లు అర్జున్ పై నమ్మకంతో నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుంది.

Tags:    

Similar News