సెన్సార్ పూర్తి చేసుకున్న "పుష్ప".. రిలీజ్ కు రెడీ
పుష్ప సినిమా ఈనెల 17వ తేదీన ప్రపంచ వ్యాపంగా భారతీయ ప్రధాన భాషల్లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా పుష్ప - ది రైజ్. ఈ సినిమా ఈనె 17వ తేదీన ప్రపంచ వ్యాపంగా భారతీయ ప్రధాన భాషల్లో విడుదలయ్యేందుకు సిద్ధమవుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. ఇటీవలే పుష్ప ట్రైలర్ విడుదలవ్వగా.. నేడు సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.
గెస్ట్ ఎవరన్నది?
ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో పుష్ప - ది రైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవెంట్ కు ప్రధాన గెస్ట్ ఎవరన్నదానిపై సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారు నిర్వాహకులు. కాగా.. పుష్ప సినిమాలో విలన్ పాత్రలో ఫహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవ్వనున్నాడు. అనసూయ, సునీల్, జగపతి బాబు తదితరులు ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు.