ఒకటే రిక్వెస్ట్.. ఎలా వచ్చామో.. అలాగే వెళ్లిపోదాం - అల్లు అర్జున్

పుష్ప సినిమా ఈ నెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్త విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజు మేకర్స్ మూవీ మేకింగ్ వీడియో విడుదల చేశారు

Update: 2021-12-07 12:18 GMT

పుష్ప - ది రైజ్ 01 సినిమా ఈ నెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్త విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్క లిరికల్ వీడియో సాంగ్ లను విడుదల చేస్తూ వస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ తో పాన్ ఇండియా లెవెల్లో పుష్ప పై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా ? ఎప్పుడెప్పుడు చూసేద్దామా అన్న ఊపుతో ఉన్నారు అల్లు అర్జున్ అభిమానులు.

మూవీ మేకింగ్ వీడియో....
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు మూవీ మేకింగ్ వీడియో విడుదల చేశారు. కాగా.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు అల్లు అర్జున్ చిత్ర యూనిట్ మొత్తానికి ఓ విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోను కూడా మేకింగ్ వీడియోలో జత చేశారు మేకర్స్. ఇంతకీ అల్లు అర్జున్ ఏం చెప్పారంటే.. "నా సైడ్ నుంచి ఒకటే ఒక రిక్వెస్ట్. ఎవరు వినియోగించిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, కప్పుల్ని వారే దయచేసి డస్ట్‌బిన్‌లో వేయండి. మనం ఈ ప్లేస్ కి ఎలా వచ్చామో.. అలాగే ఇక్కడి నుంచి బయటికి వెళ్లిపోదాం. అని చిత్ర యూనిట్ కు సూచించారు."
ఈ కాంబినేషన్ లో మూడో సినిమా...
ఆర్య, ఆర్య - 2 సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూడవ సినిమా ఇది. దీనిపై అభిమానులకే కాదు.. దర్శకుడు, హీరో కి కూడా భారీ అంచనాలున్నాయి. అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తిగా ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. రష్మిక మందన్న అల్లు అర్జున్ కు జోడీగా నటించగా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముత్తంశెట్టి మీడియా, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.


Tags:    

Similar News