అక్కడ కూడా అల్లు అర్జునే ఫస్ట్ తెలుగు యాక్టర్..

నేషనల్ అవార్డు, ఇన్‌స్టాగ్రామ్ డాక్యుమెంటరీ విషయంలో తనే ఫస్ట్ యాక్టర్ అని అనిపించుకున్న అల్లు అర్జున్..

Update: 2023-10-06 11:33 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవాలు అందుకుంటూ.. నిజంగానే ఒక 'ఐకాన్'గా నిలిస్తున్నాడు. ఇటీవల పుష్ప-1 సినిమాకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. కాగా టాలీవుడ్ లో ఇప్పటివరకు ఆ అవార్డుని ఎవరు అందుకోలేదు. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న ఫస్ట్ తెలుగు యాక్టర్ గా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశాడు.

ఆ తరువాత ఇన్‌స్టాగ్రామ్ సంస్థ నుంచి ఒక ప్రత్యేక టీం వచ్చి.. అల్లు అర్జున్ పై ఒక షార్ట్ డాక్యుమెంటరీని చిత్రీకరించారు. ఇండియాలో ఏ నటుడు ఇలాంటి ఘనతని అందుకోలేదు. దీంతో ఈ విషయంలో కూడా తనే ఫస్ట్ యాక్టర్ అని అనిపించుకున్నాడు. అయితే ఇప్పుడు మరోసారి.. మళ్ళీ తనే నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు. ఇంతకీ అల్లు అర్జున్ ఇప్పుడు ఎందుకని నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు..?
దాదాపు 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తమ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు ప్రతిఒక్కరు. అలాంటి మ్యూజియంలో అల్లు అర్జున్ విగ్రహం కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని గురించి అటు మ్యూజియం వారు గాని, ఇటు అల్లు అర్జున్ టీం గాని అధికారికంగా తెలియజేయలేదు.
తాజాగా మ్యూజియం మానేజ్మెంట్ అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. కాగా టాలీవుడ్ నుంచి ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్ మైనపు విగ్రహాలను ఆ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ ఇద్దరివీ ఉన్నదీ లండన్ మ్యూజియంలో. మేడమ్‌ టుస్సాడ్స్‌ సంస్థకి వరల్డ్ వైడ్ గా మ్యూజియంలు ఉన్నాయి. ఈక్రమంలోనే దుబాయ్ లో కూడా ఒక మ్యూజియం ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ విగ్రహాన్ని అక్కడే ఏర్పాటు చేస్తున్నారు.
దుబాయ్ మ్యూజియంలో విగ్రహావిష్కరణ జరుపుకుంటున్న తొలి తెలుగు యాక్టర్ అయితే అల్లు అర్జునే. ఇక ఈ విషయంలో కూడా అల్లు అర్జున్ ఫస్ట్ అనిపించుకోవడంతో అభిమానులు నెట్టింట తెగ సందడి చేస్తున్నారు. కాగా 'అల వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ రెడ్ జాకెట్‌తో స్టైలిష్ గా కనిపించే లుక్ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఇప్పుడు మ్యూజియంలో ఆ లుక్ తోనే విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. అల్లు అర్జున్ ఇటీవలే దుబాయ్ వెళ్లి విగ్రహం కోసం కొలతలు కూడా ఇచ్చాడట.


Tags:    

Similar News