అల్లు అర్జున్ పప్పులుడకలేదట!!
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా విషయంలో తాను చెప్పిందే చేసేలా చేసాడని.. త్రివిక్రమ్ కూడా అజ్ఞాతవాసి, అరవింద సమేత చిత్రాల తర్వాత కాస్త డల్ అవడంతో.. [more]
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా విషయంలో తాను చెప్పిందే చేసేలా చేసాడని.. త్రివిక్రమ్ కూడా అజ్ఞాతవాసి, అరవింద సమేత చిత్రాల తర్వాత కాస్త డల్ అవడంతో.. [more]
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా విషయంలో తాను చెప్పిందే చేసేలా చేసాడని.. త్రివిక్రమ్ కూడా అజ్ఞాతవాసి, అరవింద సమేత చిత్రాల తర్వాత కాస్త డల్ అవడంతో.. అక్కడ అల్లు అర్జున్ చెప్పిందే నడిచింది అని అంటారు. అయితే సుకుమార్ విషయానికొచ్చేసరికి థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్న ఆలు ర్జున్ ని సుకుమర్ కన్విన్స్ చేసాడు. దేవిశ్రీ ని పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ గా రంగంలోకి దింపడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడు. ఇక సుకుమార్ పుష్ప సినిమాని కేరళ అడవుల్లోని చెయ్యాలని ట్రయిల్ షూట్ కూడా చేసుకుని కూర్చున్నాడు. అయితే కరోనా పరిస్థితి కారణముగా పుష్ప షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లోనే చేస్తే బావుంటుంది అని అల్లు అర్జున్ చెప్పడమే కాదు…. లొకేషన్స్ కోసం సెర్చ్ కూడా చేసాడు.
ఉదయం జాగింగ్ కోసం అంటూ హైదరాబాద్ సిటీ వెలుపల పుష్ప లొకేషన్స్ వెతకడం, కుంటాల జలపాతాన్ని సందర్శించడం, మహబూబ్ నగర్ అడవులలో సెర్చ్ చెయ్యడం, మహారాష్ట్రలో కూడా కొన్ని లొకేషన్స్ ని చుట్టెయ్యడం చేసినా.. చివరికి సుకుమార్ చెప్పినట్టుగానే కేరళ అడవులకు పుష్ప షూటింగ్ షిఫ్ట్ అవ్వబోతుంది. కరోనా ఉదృతి తగ్గడంతో సుకుమార్ కేరళ అడవులు, జలపాతం దగ్గరే పుష్ప షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసాడు. నవంబర్ మొదటి వారంలో కేరళ అడవుల్లో ఈ చిత్రం షూటింగును మొదలెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.మరి బన్నీ ఎన్ని లొకేషన్స్ సెర్చ్ చేసినా చివరికి సుక్కు మాటే నెగ్గింది.