పుష్ప ట్రైలర్ టీజ్.. 6న ఫుల్ ట్రైలర్

భారీ అంచనాలతో వస్తోన్నచిత్రం పుష్ప. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Update: 2021-12-03 14:16 GMT

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ భారీ సినిమాల విడుదల సీజన్ మొదలైంది. అఖండ తో భారీ సినిమాల విడుదలకు మంచి బజ్ ప్రారంభమయిందనే చెప్పాలి. దాని తర్వాత భారీ అంచనాలతో వస్తోన్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అటు అల్లు అర్జున్, మెగా అభిమానులు, ఇటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీన పుష్ప - పార్ట్ 1 సర్ ప్రైజ్ ఉంటుందని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.

27 సెకన్ల నిడివి....
కాగా.. శుక్రవారం ట్రైలర్ కు సంబంధించి 27 సెకన్ల నిడివి గల ట్రైలర్ టీజ్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ వీడియోలో.. సినిమాలోని కీలక పాత్రల్ని, థీమ్‌ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. కానీ ట్రైలర్ టీజ్ చాలా ఫాస్ట్ గా ఉండటంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారనే చెప్పాలి. ఈ సినిమాలో ఎవరెవరు ఏ పాత్ర పోషించారో చూడాలనుకుంటే మాత్రం ట్రైలర్‌ టీజ్‌ చూసేటప్పుడు యూట్యూబ్‌ ప్లే సెట్టింగ్స్‌లో స్పీడ్‌ను 0.25Xకు తగ్గించుకుంటే 'పుష్ప' అసలు ప్రపంచం కనపడుతుంది.
డిసెంబరు 17న...
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న పుష్ప - పార్ట్ 1 డిసెంబర్ 17వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. దేవిశ్రీ ఈ సినిమా పాటలకు సంగీతాలు సమకూర్చగా.. ఇప్పటి వరకూ విడుదలైన నాలుగు పాటలు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.


Tags:    

Similar News