పాన్ ఇండియానా బొక్కా ? ఊ అంటావా పాటపై సమంత రీ ట్వీట్ !

అల్ట్రా మైమీ పేరుతో ప్రతి సంవత్సరం మార్చి నెలలో యూఎస్ ఫ్లోరిడాలోని మైమీ పట్టణలో జరిగే బిగ్గెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్..;

Update: 2022-03-27 12:44 GMT

హైదరాబాద్ : విడాకుల తర్వాత సమంత ఫుల్ బిజీ అయిపోయింది. చేతినిండా సినిమాలతో మంచి జోష్ లో ఉంది. ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన సామ్.. ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్లను అందుకుంటోంది సామ్. ఇటీవల పుష్ప సినిమాలో సమంత "ఊ అంటావా.. ఊఊ అంటావా" స్పెషల్ సాంగ్ లో చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ పాటపై ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. దానిని సమంత రీ ట్వీట్ చేసింది. నెట్టింట్లో ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.

అల్ట్రా మైమీ పేరుతో ప్రతి సంవత్సరం మార్చి నెలలో యూఎస్ ఫ్లోరిడాలోని మైమీ పట్టణలో జరిగే బిగ్గెస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. లక్షలాది మంది ఆడియన్స్ మధ్య ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ఈ వేదికపై సమంత నటించి ఊ అంటావా.. ఊహు అంటావా సాంగ్ ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ షేర్ చేస్తూ.. ఇది నమ్మశక్యం కానీ రిచ్. పాన్ ఇండియానా బొక్కనా.. పాన్ వరల్డ్.. అంటూ పుష్ప సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఇక అతని ట్వీట్‏ను సమంత రీట్వీట్ చేస్తూ నిజమేనా ? ఇది అల్ట్రా మైమీ మ్యూజిక్ ఫెస్టివల్ లోనా ? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.




Tags:    

Similar News