అవమానాన్ని తట్టుకోవాలనే నిర్ణయించుకున్నాడా?

మంచి కొరియోగ్రాఫేర్, మంచి యాక్టర్, మంచి దర్శకుడు, అలాగే మంచి మనసున్న వ్యక్తి రాఘవ లారెన్స్. తన పనేదో తాను చూసుకుంటూ.. సినిమాలను డైరెక్ట్ చేస్తూ.. తాను [more]

Update: 2019-06-03 03:42 GMT

మంచి కొరియోగ్రాఫేర్, మంచి యాక్టర్, మంచి దర్శకుడు, అలాగే మంచి మనసున్న వ్యక్తి రాఘవ లారెన్స్. తన పనేదో తాను చూసుకుంటూ.. సినిమాలను డైరెక్ట్ చేస్తూ.. తాను డైరెక్ట్ చేసిన సినిమాల్లో హీరోగా నటిస్తూ ఉండే రాఘవకి ఈమధ్యన పర భాషలో అవమానం జరిగిందంటూ రాఘవ సోషల్ మీడియాలో వాపోయాడు. తాను దర్శకత్వం వహించి నటించిన కాంచన సినిమా బ్లాక్ బస్టర్ ని బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా లక్ష్మి బాంబ్ అంటూ మొదలు పెట్టాడు. కొంతమేర షూటింగ్ కూడా జరిగాక… రాఘవ లారెన్స్ విషయంలో నిర్మాతలు కాస్త ఓవరేక్షన్ చెయ్యడంతో పాటుగా రాఘవ కి సంబంధం లేకుండా లక్ష్మి బాంబ్ ఫస్ట్ లుక్ కూడా విడుదల కావడంతో.. అలిగిన రాఘవ అర్ధాంతరంగా లక్ష్మి బాంబ్ సినిమా నుండి తప్పుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటించాడు. తన పట్ల లక్ష్మి బాంబ్ నిర్మాతలు వ్యవహరించిన తీరు నచ్చకే తాను ఆ ప్రాజెక్ట్ నుండి బయటికొచ్చినట్టుగా చెప్పాడు. ఇక తాను డైరెక్షన్ నుండి బయటికొచ్చినా.. అక్షయ్ కుమార్ మీదున్న గౌరవంతో తన స్క్రిప్ట్, సినిమా హక్కులను ఆయనకే వదిలేస్తున్నట్లు ప్రకటన చేసాడు.

అలా రాఘవ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగానే సౌత్ డైరెక్టర్స్ పట్ల బాలీవుడ్ నిర్మాతల ఓవరేక్షన్ అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో న్యూస్ లు వెలువడ్డాయి. ఇక తాజాగా రాఘవ లారెన్స్ మళ్ళీ లక్ష్మి బాంబ్ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అక్షయ్ కుమార్, రాఘవ లారెన్స్ ని మళ్ళీ ఒప్పించి ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చెయ్యడానికి తీసుకొచ్చాడని… హీరో కి లారెన్స్ కి మధ్యన డీల్ సెట్ అయ్యి మళ్ళీ ఈ సినిమా పట్టాలెక్కబోతుందని అంటున్నారు. మరి అక్షయ్ కుమార్ ఏం చెప్పాడో తెలియదు కానీ.. రాఘవ మాత్రం మళ్ళీ నిర్మాతలు చేసే అవమానాన్ని భరించాలని నిర్ణయం తీసుకున్నాడనిపిస్తుంది

Tags:    

Similar News