విన్ అయినా సంతోషం లేదు

బిగ్ బాస్ హౌస్ లో బద్దకస్తుడిగా పరిచయం అయినా రాహుల్ సిప్లిగంజ్.. మెల్లగా పుంజుకుని బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా నిలిచాడు. శ్రీముఖి తో [more]

Update: 2019-11-08 05:22 GMT

బిగ్ బాస్ హౌస్ లో బద్దకస్తుడిగా పరిచయం అయినా రాహుల్ సిప్లిగంజ్.. మెల్లగా పుంజుకుని బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా నిలిచాడు. శ్రీముఖి తో ఫైనల్ పోరులో పోటీపడి విన్నర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ పెద్దగా సంతోషంగా కనబడ్డ లేదు. సీజన్ 2 లో కౌశల్ విన్నర్ అయినప్పుడు.. బయట టివి ఛానల్స్ లో కూర్చుని తనకి పీఎంవో నుండి కాల్ వచ్చిందని, కౌశల్ ఆర్మీ వలన గిన్నిస్ బుక్ వారు తన పేరుని పరిశీలించారని చెప్పి గొప్పలు పోయాడు. తర్వాత అవి ఫెక్ అని తేలింది లెండి. మరి రాహుల్ మాత్రం సింగర్ గా ప్రేక్షకులకు పరిచయమై బిగ్ బాస్ విన్నర్ అయినా పెద్దగా హ్యాపీ ఫీల్ కావడం లేదు. ఎందుకంటే శ్రీముఖి లా రోజుకి లక్ష తీసుకోలేదు.

అలాగే ప్రైజ్ మని 50 లక్షలు చేతికి రాలేదు. అందులో కటింగ్స్ పోను 35 లక్షలు మాత్రమే అందుకున్న రాహుల్… బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వారానికి మాత్రమే తనకి పారితోషకం కింద ఇచ్చారని, కానీ అది ఎంత అనే ఫిగర్ చెప్పలేనని, కానీ తక్కువ మొత్తంలో మాత్రమే తాను పారితోషకం కింద అందుకున్నానని… వాపోతున్నాడు. ఇక ఆ డబ్బుతో ఓ సొంత ఇల్లు కొనుక్కుంటానని… మిగిలితే సెలూన్ పెట్టుకుంటానని చెబుతున్నాడు. ఇక పునర్నవి తో తనకి కేవలం స్నేహం మాత్రమే అని, తనకు నాకు పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని రాహుల్ టివి ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెబుతున్నాడు. మరి విన్నర్ అవగానే అంత కాదు ఇంతాకాదు అని చెప్పుకునే వారు ఉంటే.. రాహుల్ మాత్రం జెన్యూన్ గా బిగ్ బాస్ వలన తనకి ఒరిగిందేమి లేదని చెప్పడం ఇక్కడ షాక్ కలిగించే అంశం

Tags:    

Similar News