బిగ్ బాస్ లో షాకింగ్

బిగ్ బాస్ ఫైనల్ దగ్గర పడుతుంది. మరో వారంలో ఎవరు సీజన్ 3 టైటిల్ విన్నర్ అని తేలిపోనుంది. అయితే నిన్న ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య [more]

Update: 2019-10-23 06:26 GMT

బిగ్ బాస్ ఫైనల్ దగ్గర పడుతుంది. మరో వారంలో ఎవరు సీజన్ 3 టైటిల్ విన్నర్ అని తేలిపోనుంది. అయితే నిన్న ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య అందరి అంచనాలను, ఊహలను తలకిందులు చేస్తూ రాహుల్ టిక్కెట్ టు ఫినాలే సాధించాడు. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న టాస్కుల్లో ఎక్కువ పాయింట్స్ రాహుల్ కి రావడంతో ఆయన డైరెక్ట్ గా ఫైనల్ కి వెళ్ళిపోయాడు.

రాహుల్ సేఫ్…..

నిజానికి నిన్నటి వరకు రాహుల్ కంటే ముందు అలీ రెజా ఎక్కువ పాయింట్స్ తో ఉన్నారు. కానీ నిన్న అలీ అనవసరంగా విపరీత ప్రవర్తన ఆధారంగా అతన్ని బిగ్ బాస్ టాస్కుల నుంచి తప్పించారు. దాంతో మొదటినుంచి ఫేవరెట్ లిస్ట్ లో లేని రాహుల్ సడన్ గా ఫైనల్ కి వెళ్లిపోవడంతో చాలామంది షాక్ తిన్నారు. ఇక ఈ వారం అయిదుగురు ఇంటి సభ్యులు నామినేషన్ లో ఉన్నారు. రాహుల్ సేఫ్ అవ్వడంతో శ్రీముఖి, బాబా, అలీ,వరుణ్, శివ జ్యోతి ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అవుతారో చూడాలి. చూద్దాం ఎన్నో రోజులు లేదు ఫైనల్ కి.

 

Tags:    

Similar News