ఆస్కార్ పై జక్కన్న విమర్శలు!

ఇండియా మొత్తం లాక్ డౌన్ కావడంతో మన డైరెక్టర్స్ కూడా ఇంటికి పరిమితం కావడంతో ఇంట్లో నుండే ఇంటర్వ్యూ లు ఇవ్వడం స్టార్ట్ చేసారు. అందులో భాగంగానే [more]

Update: 2020-04-25 07:55 GMT

ఇండియా మొత్తం లాక్ డౌన్ కావడంతో మన డైరెక్టర్స్ కూడా ఇంటికి పరిమితం కావడంతో ఇంట్లో నుండే ఇంటర్వ్యూ లు ఇవ్వడం స్టార్ట్ చేసారు. అందులో భాగంగానే రాజమౌళి ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇంటర్వ్యూ లో రాజమౌళి తనకు ఆస్కార్ విన్నింగ్ చిత్రం 'పార‌సైట్‌' న‌చ్చ‌లేదంటూ రాజ‌మౌళి చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల స్పంద‌న‌లు వినిపిస్తున్నాయి. రాజమౌళి అభిప్రాయాన్ని కొంతమంది విమర్శిస్తుంటే మరికొంత మంది అది తన వ్యక్తిగత నిర్ణయం అని అంటున్నారు.

అంతటితో ఆగలేదు..ఆ తరువాత ఇంటర్వ్యూ లో కూడా ఆస్కార్ అవార్డుల‌పై ఘాటైన విమర్శలే చేసాడు. 'పార‌సైట్‌' నాకు నచ్చడం నచ్చకపోవడం అనేది నా వ్య‌క్తిగ‌త అభిప్రాయం. ఆస్కార్ అవార్డ్స్ విషయంలో కూడా లాబీయింగ్ ఉంటుంది. ఓ సినిమాను జ్యూరీ స‌భ్యులు చూడాలంటే చాలా త‌తంగ‌మే న‌డుస్తుంది. కానీ జ్యూరీ ప్ర‌మాణాల్ని పాటిస్తుంటుంద‌ని ప్ర‌పంచం మొత్తం న‌మ్ముతుంద‌ని ఓ చెత్త సినిమాకి వారు అవార్డు ఎలా ఇస్తారు? అటువంటి పరిస్థితి అక్కడ ఉండదు అనే నమ్మకంతో ఉన్నానని… గ‌తంలోనూ ఆస్కార్ సాధించిన చాలా సినిమాలు త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పుకొచ్చాడు. అంతే కాదు నాకు చాలా అవార్డు విన్నింగ్ సినిమాలు కూడా నచ్చలేదని..నాకే కాదు చాలామంది ఇటువంటి సినిమాలు నచ్చలేదని చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు ఈ కామెంట్స్ కి ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తాయో చూడాలి.  

Tags:    

Similar News