మా పరిస్థితి ఏమిటి జక్కన్నా?

కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. నిన్నమొన్నటి వరకు సీరియల్ ఆర్టిస్టులే కరోనా మహమ్మారికి దొరికిపోతే ఇప్పుడు బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ నుండి ఆయన ఫ్యామిలీ [more]

Update: 2020-07-31 03:41 GMT

కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. నిన్నమొన్నటి వరకు సీరియల్ ఆర్టిస్టులే కరోనా మహమ్మారికి దొరికిపోతే ఇప్పుడు బాలీవుడ్ మెగా స్టార్ అమితాబచ్చన్ నుండి ఆయన ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడి నానావతి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. అమితాబ్, అభిషేక్ లు ఇంకా హాస్పిటల్ లోనే ఉంటె.. ఐశ్వర్య రాయ్ ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ లు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజాగా టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి కరోనా బారిన పడ్డాడు. నాకు కరోనా పాజిటివ్ అంటూ స్వయానా రాజమౌళే ట్వీట్ చేసాడు. కొద్దిగా ఫీవర్ ఉండడంతో కరోనా  టెస్ట్ చేయించుకున్న రాజమౌళి కరోనా పాజిటివ్ అని తెలీడంతో కుటుంబ సభ్యులంతా కరోనా టెస్ట్ చేశయించుకోగా పాజిటివ్ అని తెలగా.. రాజమౌళి తో ఆయన ఫ్యామి మెంబెర్స్ మొత్తం హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అభిమానులకి ఓ టెంక్షన్ పట్టుకుంది. RRR సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా కారణంగా ఆగింది. ప్రస్తుతం రాజమౌళికి కరోనా అని తేలడంతో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అభిమానులు కంగారు పడుతున్నారు. రాజమౌళి త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అసలే షూటింగ్ లేట్ అవుతున్నా రాజమౌళి ఇంటి నుండే ఎడిటింగ్ దగ్గరనుండి గ్రాఫిక్స్ వర్క్.. అలాగే RRR సంబందించిన పనులని చక్కబెడుతున్నారు. కానీ ఇప్పుడు కరోనా తో రాజమౌళి అవన్నీ పక్కనబెట్టాలి,. దానితో RRR మరింత లెట్ అయ్యే ప్రమాదముందని ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు కంగారు పడుతున్నారు. ఇక రాజమౌళి మీద జాలితో తనకి ట్వీట్స్ చెయ్యొద్దు అంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా అందరికి చెబుతున్నాడు.

Tags:    

Similar News