రాజమౌళి ఆర్డర్… ఫాలో అవుతున్న టీం?

కరోనా తో కాలం కరిగిపోతుంది కానీ.. కరోనా మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా కారణంగా ఆరు నెలలు టైం వేస్ట్ అయ్యింది. ఇక సినిమా షూటింగ్స్ [more]

Update: 2020-10-04 05:18 GMT

కరోనా తో కాలం కరిగిపోతుంది కానీ.. కరోనా మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా కారణంగా ఆరు నెలలు టైం వేస్ట్ అయ్యింది. ఇక సినిమా షూటింగ్స్ మొదలు పెడితే టైం వేస్ట్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లో సినిమాల షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్స్ వేస్తున్నారు. రాజమౌళి కూడా RRR షూటింగ్ ప్లాన్స్ రెడీ చేసినట్లుగా టాక్. అందుకే హీరోలిద్దరిని, సినిమాకి పనిచేసే టెక్నీకల్ టీం తో చర్చించి RRR షూటింగ్ విషయంలో అందరూ ఓ కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరూ రాజమౌళి ఎప్పుడు అంటే అప్పుడు షూటింగ్ కోసం రెడీ అయ్యేలా కనిపిస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం ఇలా డైరెక్ట్ గా షూటింగ్ మొదలు పెట్టవద్దు. రేపు టీంలో ఒక్కరు ఎఫెక్ట్ అయినా ఇబ్బంది పడాలి.

అందుకే RRR టీం లోని సభ్యులంతా ఓ 15 రోజుల క్వారంటైన్ లో ఉండమని చెప్పినట్లుగా టాక్. ఎన్టీఆర్ – రామ్ చరణ్ తో సహా అందరూ ఈ 15 రోజులు ఖచ్చితంగా క్వారంటైన్ లోనే గడపాలని రాజమౌళి ఆర్డర్ అంట. ఎందుకంటే రాజమౌళికి కరోనా సోకడం వెంటనే ఫ్యామిలీ మొత్తం కరోనా బారిన పడడంతో .. ఇప్పడు కరోనా ఉదృతంగా ఉన్న టైం లో షూటింగ్ మొదలు పెట్టినట్లయితే.. భారీ నటీనటులు ఉంటారు అలాగే, టెక్నీకల్ గా టీం ఉంటుంది. అందులో ఒక్కరు కరోనా తో ఎఫెక్ట్ అయినా టీం మొత్తం ఇబ్బంది పడాలి. మళ్ళీ షూటింగ్ కి బ్రేకులు పడతయి. కాబట్టే అందరూ ఓ 15 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండి షూటింగ్ స్పాట్ కి వెళితే ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదని రాజమౌళి ప్లాన్. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిన RRR ని ఎప్పుడు విడుదల చెయ్యాలనేది ఇప్పుడే చెప్పడం కష్టమని రాజమౌళి తేల్చేసాడు. 

ఇక షూటింగ్ మొదలయ్యాక రెండు నెలల షూటింగ్ ని కంటిన్యూ చెయ్యాలని అనుకుంటున్నాము. ఆ రెండు నెలల షూటింగ్ అనుకున్నట్టుగా సజావుగా సాగితేనే RRR రిలీజ్ డేట్ మీద ఓ క్లారిటీ వస్తుంది అని రాజమౌళి చెప్పడం చూస్తే.. RRR వచ్చే వేసకి రావడం కష్టమనిపిస్తుంది.

Tags:    

Similar News