ఎన్టీఆర్, చరణ్ లకు వార్ణింగ్ ఇచ్చిన జక్కన్న?

రాజమౌళి సినిమా షూటింగ్ సెట్స్ నుండి పిక్స్ లీకవ్వడమనేది జరగని పని. అంత పకడ్బందీగా రాజమౌళి సినిమా షూటింగ్స్ ప్లాన్స్ ఉంటాయి. సెట్స్ నుండి ఎలాంటి ఫోటో [more]

Update: 2019-12-12 06:33 GMT

రాజమౌళి సినిమా షూటింగ్ సెట్స్ నుండి పిక్స్ లీకవ్వడమనేది జరగని పని. అంత పకడ్బందీగా రాజమౌళి సినిమా షూటింగ్స్ ప్లాన్స్ ఉంటాయి. సెట్స్ నుండి ఎలాంటి ఫోటో కానీ వీడియో కానీ లీకవ్వకుండా రాజమౌళి ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి రానివ్వకుండా సినిమా షూటింగ్ మొదలెట్టినప్పుడే రూల్స్ పాస్ చేస్తాడు. అంత పకడ్బందీగా ప్లాన్ చేసినా…. #RRR సినిమా సెట్స్ నుండి ఎన్టీఆర్ పిక్ లీకవడం కలకలం సృష్టించింది. నిన్న ఎన్టీఆర్ విశాఖ మన్యం లో #RRR సినిమా షూటింగ్ లో సీన్ రిహార్సల్ అప్పుడు ఎవరో ఎన్టీఆర్ ని ఫోటో తీసి సోషల్ మీడియాలో వదిలారు. దానితో ఎన్టీఆర్ కొమరం భీం లుక్ దాదాపుగా బయటికొచ్చేసింది.

అయితే రాజమౌళి తన సినిమాలోని కేరెక్టర్స్ ని ఎంత పకడ్బందీగా.. తీర్చిదిద్దుడుతాడో ఆంటే అందంగా బయటికి వదులుతాడు. పబ్లిసిటీ ప్రాసెస్ లో రాజమౌళి ని మించినోడు లేదు. అయితే ఇలా ఎన్టీఆర్ లుక్ బయటికి రావడంతో షాకైన రాజమౌళి షూటింగ్ సెట్స్ లో ఆర్దర్స్ పాస్ చేసాడని, ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు కూడా తమ ఫోన్స్ ని సెట్ లోపలి తేవొద్దని చిన్నపాటి వార్ణింగ్ లాంటిది ఇచ్చాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. తాను ఇంతకుముందు పెట్టిన రూల్స్ ని ఇంకా కఠిన తరం చెయ్యాలని జక్కన్న డిసైడ్ అవడం వలెనే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా తమ ఫోన్స్ ని బయటే పెట్టి స్పాట్ లోకి వెళుతున్నారట.

Tags:    

Similar News