‘రాజు గారి గది-3’ హీరో ఎవరో తెలుసా..?
మొదట టీవీ షోలు చేసుకుంటూ ఆపై సినీ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఓంకార్ మొదటి సినిమానే ఫెయిల్ అయింది. రెండో సినిమా రాజుగారి గది ప్రేక్షకులను బాగా [more]
మొదట టీవీ షోలు చేసుకుంటూ ఆపై సినీ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఓంకార్ మొదటి సినిమానే ఫెయిల్ అయింది. రెండో సినిమా రాజుగారి గది ప్రేక్షకులను బాగా [more]
మొదట టీవీ షోలు చేసుకుంటూ ఆపై సినీ దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఓంకార్ మొదటి సినిమానే ఫెయిల్ అయింది. రెండో సినిమా రాజుగారి గది ప్రేక్షకులను బాగా ఆదరించడంతో దాన్ని సీక్వెల్ గా రాజుగారి గది 2 తెరకెక్కించాడు ఓంకార్. అయితే ఈసారి స్టార్ హీరో నాగార్జునని పెట్టి ఈ సినిమా చేసాడు. చిన్న డైరెక్టర్స్ కి నాగ్ అవకాశం ఇవ్వడం అలవాటు. అలానే ఓంకార్ కి కూడా ఇచ్చాడు. నాగ్ తో పాటు ఆయన కోడలు సమంత కూడా నటించడంతో ఆ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో ఆడలేదు.
మళ్లీ నాగార్జున తోనే…
ప్రస్తుతం ఓంకార్ మళ్లీ బుల్లితెరకు వెళ్లి షోస్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు తను ‘రాజు గారి గది-3’ తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో తమన్నా ప్రధాన పాత్ర చేస్తుందని ఇంతకుముందు వార్తలొచ్చాయి. అయితే ఓంకార్ మాత్రం లేడీ క్యారెక్టర్‌ను మారుస్తూ నాగార్జునను అలాగే కొనసాగించాలనుకుంటున్నాడట. ఆల్రెడీ ఓంకార్ నాగ్ ని సంప్రదించాడట. ‘రాజు గారి గది-2’ పోయింది కాబట్టి ఇప్పుడు ‘రాజు గారి గది-3 ‘ చేయడానికి నాగ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదట. ఒకవేళ నాగ్ కాదంటే వెంకీ వద్దకు వెళదాం అని ఓంకార్ ఆలోచనట.