రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలకి బ్రేక్

టాలీవుడ్ లో ఒక్కగానొక్క టైములో నెంబర్ వన్ స్థానం ను కైవసం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ స్థానాన్ని ఎక్కువ కాలం నిలబెట్టలేకపోయింది. వరస ఫ్లాపులు [more]

Update: 2019-10-20 11:34 GMT

టాలీవుడ్ లో ఒక్కగానొక్క టైములో నెంబర్ వన్ స్థానం ను కైవసం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ స్థానాన్ని ఎక్కువ కాలం నిలబెట్టలేకపోయింది. వరస ఫ్లాపులు ఆమెను కిందికి లాగేశాయి. చూస్తుండగానే టాప్ హీరోయిన్ అయినా రకుల్ కు ప్రస్తుతం తన చేతిలో సినిమాలు కూడా లేవు. పైగా ఈమెతో సినిమాలు తీయడానికి ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా చూపట్లేదు. దానికి కారణం ఆమె బాడీ. స్టార్టింగ్ లో బొద్దుగా ఉన్న రకుల్ సడన్ గా సన్నగా మారడంతో ఈమెతో సినిమాలు చేయడానికి డైరెక్టర్స్ ఎవరు దైర్యం చేయడంలేదు. అయినా రకుల్ ఇవేమి పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది.

కానీ ఇప్పుడు రకుల్ చేతిలో భార‌తీయుడు-2 తప్ప ఏ సినిమాలు లేవు. ఇప్పుడు త‌న‌కు తానుగా అవ‌కాశాలు వ‌ద్ద‌నుకుని కొంత కాలం విరామం తీసుకోవాల‌ని భావిస్తుండ‌టం విశేషం. స్వయంగా రకుల్ ప్రీత్ సింగే ఈ విషయాన్నీ మీడియా వారికి చెప్పింది. ఎంత కష్టపడినా సరైన ఫలితాలు రావడంలేదు. అందుకే కొంతకాలం సినీ రంగానికి దూరమవ్వాలని నిర్ణయించుకున్నా.భ‌విష్య‌త్తులో మంచి కథ, నచ్చిన పాత్ర అయితేనే సినిమాలు అంగీకరిస్తాను“ అని ర‌కుల్ స్ప‌ష్టం చేసింది.

Tags:    

Similar News