ఎప్పుడు బిజినే.. కానీ ఈసారే?

టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ లోను కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ లేక సినిమా సెట్స్ అన్ని వెలవెలబోతున్నాయి. హీరోలు, హీరోయిన్స్ అంతా షూటింగ్స్ కి [more]

Update: 2020-05-22 04:36 GMT

టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ లోను కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ లేక సినిమా సెట్స్ అన్ని వెలవెలబోతున్నాయి. హీరోలు, హీరోయిన్స్ అంతా షూటింగ్స్ కి ప్యాకప్ చెప్పేసి ఇంట్లోనే గడుపుతున్నారు. ఒక వారం పదిరోజులు అంటే ఓకె కానీ.. దాదాపుగా రెండు నెలలు కరోనా తో ఇంట్లోనే వుండెసరికి అందరికి ఇప్పుడు బోర్ స్టార్ట్ అయ్యింది. అవకాశాలున్న హీరోయిన్స్, అవకాశాలు లేని హీరోయిన్స్ అంతా ఇప్పుడు బాగా బోర్ ఫీలవుతున్నారు. తాజాగా రకుల్ కూడా కరోనా లాక్ డౌన్ తో బోర్ ఫీలవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటివరకు హాట్ ఫొటోస్ తోనూ, వర్కౌట్స్ తోనూ సోషల్ మీడియా లో హడావిడి చేసింది రకుల్.

అయితే తాజాగా కరోనా లాక్ డౌన్ గురించి రకుల్ మాట్లాడుతూ…. సౌత్ లో నేనెప్పుడూ 365 రోజులు షూటింగ్స్ తోనూ ఇతర పనుల్లతోను బిజీగా ఉండేదాన్ని.. కానీ కరోనా తో ఇప్పుడు రెండు నెలల నుండి ఇంట్లోనే ఉంటున్నాను. కెరీర్ మొదలెట్టినప్పటినుండి మొదటిసారి ఇంతగా బ్రేక్ తీసుకున్నది అంటుంది. 2020 లో ఎన్నో సాధించాలని.. మరెన్నో పూర్తి చెయ్యాలని అందరం అనుకున్నాం. కానీ కరోనాతో చాలా రోజులు ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అంటుంది రకుల్ ప్రీత్.

Tags:    

Similar News