ఫస్ట్ టైం రకుల్ అలా..!!

రకుల్ ప్రీత్ అవకాశాలు తగ్గాయంటే ఆమెకి కోపం వస్తుంది. నాకు అవకాశాలు తగ్గలేదు నేనే సినిమాలకు గ్యాప్ ఇచ్చా అంటూ కవర్ చేస్తుంది. జిమ్ లో వర్కౌట్స్ [more]

Update: 2020-07-23 15:34 GMT

రకుల్ ప్రీత్ అవకాశాలు తగ్గాయంటే ఆమెకి కోపం వస్తుంది. నాకు అవకాశాలు తగ్గలేదు నేనే సినిమాలకు గ్యాప్ ఇచ్చా అంటూ కవర్ చేస్తుంది. జిమ్ లో వర్కౌట్స్ చేసి వాళ్ళు తగ్గించుకుంటే.. అవకాశాలు లేక రకుల్ అన్నం మానేసింది అందుకే చిక్కిపోయింది అంటారంటూ కౌంటర్ వేస్తుంది. అయితే ప్రస్తుతం సౌత్ లో అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయంటున్నాను రకుల్ బాలీవుడ్ లో చిన్న అవకాశము వదలడం లేదు. అయితే ఇప్పుడు అందరిలా సినిమా అవకాశాలు కోసం ఎదురు చూడకుండా వెబ్ సీరీస్ లు చేసుకుంటే మంచిదని రకుల్ ఆలోచనట. ఇప్పటికే కాజల్, సమంత, తమన్నా లాంటి వాళ్ళు వెబ్ సీరీస్ కి వెళ్లారు. అందుకే రకుల్ కూడా ఇప్పుడు అదే ఆలోచనలో ఉందట.

అయితే రకుల్ ఓ వెబ్ సీరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడూ ద్వపాత్రాభినయం చెయ్యని రకుల్ ప్రీత్ ఫస్ట్ టైం ఈ వెబ్ సీరీస్ లో డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్టుగా టాక్. అయితే డ్యూయెల్ రోల్ అంటే ఎలాగో అనుకునేరు. రకుల్ ఈ వెబ్ సీరీస్ లో కవలలుగా నటిస్తుందనీ తెలుస్తోంది. ఈ కవలలు ప్రతి విషయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడుతుంటారనీ… అలా పోటీపడే ప్రతి సన్నివేశం చాలా ఆసక్తికరంగా సాగుతుందనీ చెబుతున్నారు. అయితే రకుల్ అందరిలా ప్రయోగం చెయ్యడం లేదని.. సినిమా అవకాశాలు తగ్గడం వలనే ఇలా వెబ్ సీరీస్ లోకి దిగింది కానీ.. లేదంటే అమ్మడు కి సినిమాలు చేతిలో ఉంటె వెబ్ సీరీస్ వైపు కూడా చూడదు అంటున్నారు.

Tags:    

Similar News