రకుల్ హాట్ యోగ భంగిమ.. కరోనా ఎలా వచ్చింది

చేతిలో సినిమాలున్నా లేకపోయినా రకుల్ ప్రీత్ వర్కౌట్స్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి. ఈమధ్యన సినిమాలకన్నా జిమ్ వర్కౌట్స్ మీద ఫోకస్ పెట్టి బాగా [more]

Update: 2020-12-23 07:30 GMT

చేతిలో సినిమాలున్నా లేకపోయినా రకుల్ ప్రీత్ వర్కౌట్స్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి. ఈమధ్యన సినిమాలకన్నా జిమ్ వర్కౌట్స్ మీద ఫోకస్ పెట్టి బాగా సన్నగా పీలగా తయారైంది.. రకుల్ ప్రీత్. అంతలా జిమ్ చేసే రకుల్ కి కరోనా సోకడం కలకలం సృష్టించింది. ఎప్పుడూ జిమ్, యోగాసనాలు అంటూ బిజీగా ఉండే రకుల్ ప్రీత్ కి ఇప్పుడు చేతిలో సినిమాలతోను కళకళలాడుతుంది. తెలుగులో వైష్ణవ తేజ్ తో నటించిన సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. నితిన్ తో చెక్ సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్ లోను రకుల్ రెండు సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్న రకుల్ కి కరోనా వచ్చినట్లుగా గా ఆమె స్వయంగా తెలిపింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వెవ్ కి దగ్గరవడం ఆందోళ కలిగిస్తున్న సమయంలో రకుల్ ప్రీత్ కి కరోనా సోకడం ఆమె అభిమానులలో అందోళన కలిగించే విషయమే.

అయితే కరోనా వలన పెద్దగా ప్రమాదం లేదని, తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ ట్వీట్ చెయ్యడం కాస్త ఊరటనిచ్చింది. అయినా రకుల్ చేసే యోగాసనాలకు కరోనా మహమ్మారి పారిపోవడం ఖాయం. రకుల్ యోగాసనాలు, ఆమె జిమ్ వర్కౌట్స్ సోషల్ మీడియాలో తరుచూ చూస్తూనే ఉంటాం. ఎప్పుడూ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టే రకుల్ వ్యాయామం విషయంలో అశ్రద్ధ చెయ్యదు. అందుకే తన హాట్ యోగాసనాల ఫొటోస్ ని, జిమ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా రకుల్ హాట్ యోగాసనం పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అయినా రకుల్ చేసే యోగాసనాలకు కరోనా పారిపోవాలి కానీ.. రకుల్ కి ఎలా వచ్చింది చెప్మా అంటూ అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు.

Tags:    

Similar News