నేను సిగరెట్‌ కాల్చితే తప్పేంటి?

నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన్మథుడు 2’. కొన్ని రోజుల కిందట నాగార్జున ని హైలైట్ [more]

Update: 2019-07-16 06:30 GMT

నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన్మథుడు 2’. కొన్ని రోజుల కిందట నాగార్జున ని హైలైట్ చేస్తూ ఒక టీజర్ ని రిలీజ్ చేసారు. ఇప్పుడు తాజాగా మరో టీజర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. అయితే ఈసారి రకుల్ ప్రీత్ ని హైలైట్ చేస్తూ టీజర్ ని వదిలారు. అందులో ఆమె ఒక సీన్ లో సిగరెట్‌ తాగుతూ కనిపిస్తారు.

దాంతో నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన రకుల్ ని కొంతమంది..ఆమె ఒక అమ్మాయి. చాలామంది కి రోల్ మోడల్, అటువంటి ఆమె ఇలా సిగరెట్లు తాగితే వారూ పాడైపోతారని కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై రకుల్ కొంచం గట్టిగానే స్పదించింది.

” నేను సిగరెట్‌ కాల్చితే తప్పేంటి? అయిన ప్రజల పని అదే కదా..వాళ్ళు ఏదోకటి అంటూనే ఉంటారు. కబీర్ సింగ్ లో హీరో షాహిద్‌ కపూర్‌ కూడా సిగరెట్‌ తాగారు. అతని కి సిగరెట్‌ అలవాటు లేదు. ఎందుకంటే ఆయన నిజ జీవితం లో శాకాహారి. ఆ పాత్ర కోసం ఆయన తాగవల్సివచ్చింది కానీ నిజ జీవితాన్ని సినీ జీవితంతో కలిపి చూడకూడదు. నేను కూడా అంతే. సినిమా చూస్తే మీకే అర్ధం అవుతుంది. నేను ఎందుకు సిగరెట్‌ కాల్చానో అని. అయిన నేను ఇటువంటి ట్రోల్స్ పట్టించుకోను. నాకు వీటికైనా ఇంకా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అని సమాధానం ఇచ్చింది రకుల్

Tags:    

Similar News