స్ప్రింగ్ లాంటి షేప్ తో… అద్భుతమైన యోగాసనం

టాలీవుడ్ లో గేట్లు క్లోజ్ అయినా… కోలీవుడ్, బాలీవుడ్ లలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ కి ఫిట్ నెస్ అంటే ఎంత ప్రాణమో [more]

Update: 2019-08-18 04:04 GMT

టాలీవుడ్ లో గేట్లు క్లోజ్ అయినా… కోలీవుడ్, బాలీవుడ్ లలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ కి ఫిట్ నెస్ అంటే ఎంత ప్రాణమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొద్దిగా ఎక్కువ ఫుడ్ తిన్నప్పటికీ… నెక్స్ట్ దానికి సరిపడా జిమ్ చేస్తుంది రకుల్. ఎప్పుడూ సన్నగా నాజూగ్గా ఉండే రకుల్ ప్రీత్.. బాలీవుడ్ కెళ్ళాక మరీ జీరో సైజు కోసం వర్కౌట్స్ చేస్తుందా? అనిపించేలా ఆమె బాడీ షేప్ మారిపోయింది. ఇక నిన్నగాక మొన్న విడుదలైన మన్మధుడు 2 లోను రకుల్ ప్రీత్ గ్లామర్ గా బోల్డ్ గా నటించడమే కాదు…. చాలా సన్నగా కూడా కనిపించింది. ఇక ఎప్పుడు జిమ్స్, వర్కౌట్స్ అంటూ ఉండే రకుల్ ఇప్పుడు యోగాలో తెగ ప్రాక్టీస్ చేస్తుంది.

అది అలాంటి ఇలాంటి ప్రాక్టీస్ కాదు… కొన్ని వస్త్రాల సహాయంతో శరీరాన్ని తలకిందులుగా ఉంచి…. కళ్ళతో నమస్కారం చేస్తున్న ఒక కష్టమైనా యోగ భంగిమలో ఉన్న రకుల్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ ఇండియాలో వైరల్ అయ్యింది. శరీరాన్ని ఎటు కావాలంటే అటు తిప్పుతూ.. రకుల్ ఇచ్చిన యోగ భంగిమ చూస్తే అబ్బా రకుల్ బాడీ స్ప్రింగ్ లా వుంది అని అంటారు. రకుల్ అలా యోగ భంగిమ ఫోటో పోస్ట్ చేసిందో లేదో ఇలా ఆ పిక్ వైరల్ అయ్యింది. వర్క్ లో ఎంతగా నిబద్ధతగా ఉంటుందో.. ఆమె ఆరోగ్యం విషయంలోనూ ఆంటే నిబద్దతతో బాడీ ని ఫిట్ గా ఉంచుకుంటుంది. ఇక మన్మధుడు 2 తర్వాత రకుల్ కి తెలుగులో ఏ హీరో అవకాశం ఇస్తాడో అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే రకుల్ కి తెలుగులో క్రేజ్ పడిపోయింది. ఇక తమిళనాట భారతీయుడు 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రకుల్ కి ఛాన్స్ దక్కింది

Tags:    

Similar News