నెటిజన్ల కామెంట్స్ మీద రకుల్ రియాక్షన్ ఇలా ఉంది
తెలుగు లో స్టార్ హీరోస్ తో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ నెట్టింట్లో వచ్చే ప్రతి కామెంట్‌ను పట్టించుకోనని ఆమధ్య [more]
తెలుగు లో స్టార్ హీరోస్ తో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ నెట్టింట్లో వచ్చే ప్రతి కామెంట్‌ను పట్టించుకోనని ఆమధ్య [more]
తెలుగు లో స్టార్ హీరోస్ తో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ నెట్టింట్లో వచ్చే ప్రతి కామెంట్‌ను పట్టించుకోనని ఆమధ్య చాలాసార్లు చెప్పింది. అయితే రీసెంట్ గా కూడా ఆమె అదే చెబుతుంది అటువంటివి నేను పటించుకొను అని. ఆమె లేటెస్ట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోషూట్ ఫొటోల్ని షేర్ చేశారు.
అందులో ఆమె వస్త్రధారణను కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. అయితే ఓ ఆంగ్ల మీడియా రకుల్ ని నెటిజన్ల ప్రతికూల వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ.. ‘నిజంగా చెబుతున్నా.. ఈ ప్రశ్నకు నా దగ్గర రియాక్షన్ లేదు. నా వ్యక్తిగత విషయాలు…వ్యక్తిత్వం, నటనను విమర్శిస్తే నేను స్పందిస్తా. నెటిజన్ల మాటలు నా తల్లిదండ్రులపై ప్రభావం చూపుతాయి అనిపిస్తే రిప్లై ఇస్తా’ అని అన్నారు.
అలానే ఇటువంటి ఫొటోస్ వల్ల లైంగిక వేధింపుల కేసులు అధికం అవుతాయని వచ్చిన అభిప్రాయాల గురించి రకుల్‌ను ప్రశ్నించగా…’దాని గురించి నేను ఏమి మాట్లాడను…కానీ జనాలు వారి ఆలోచనల్ని కలుషితం చేసుకుంటే ఏం చేయలేం’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో నాగ్ తో ‘మన్మథుడు 2’లో నటిస్తున్నారు