వరుణ్ లావణ్య పెళ్లి సందడి.. చరణ్, బన్నీతో పాటు నితిన్..

వరుణ్ లావణ్య పెళ్లి పార్టీలో మెగా హీరోలతో పాటు నితిన్ ఫ్యామిలీ కూడా సందడి చేసింది.

Update: 2023-10-31 04:52 GMT

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి రేపు నవంబర్ 1న మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 30 నుంచి మొదలైన ఈ పెళ్లి సంబరం డుక.. సంగీత్ పార్టీ, హల్దీ, మెహందీ కార్యక్రమాలతో సందడిగా సాగనుంది. ఇక నిన్న నైట్ సంగీత్ పార్టీ జరగగా.. అక్కడి నుంచి కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. మెగా హీరోలు చరణ్, బన్నీతో పాటు నితిన్ కూడా ఈ పార్టీకి వెళ్ళాడు.

నిన్న రాత్రి జరిగిన సంగీత్ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫొటోలో రామ్ చరణ్-ఉపాసన దంపతులు, అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతులు, చిరంజీవి సతీమణి సురేఖ, సాయి ధరమ్ తేజ్, నూతన వధూవరులు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కనిపిస్తున్నారు. ఒక హోటల్ లో జరిగిన ఈ పార్టీలో మెగా ఫ్యామిలీ అంతా కలిసి సందడి చేసింది. కాగా కేవలం కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యిన ఈ పెళ్ళిలో.. ఇండస్ట్రీ నుంచి నితిన్ కూడా అటెండ్ అయ్యి సందడి చేశాడు.
నితిన్ ప్రస్తుతం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ షూట్ కోసం ఇటలీ వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక అక్కడే ఉండడంతో ఈ పెళ్ళికి హాజరయ్యినట్లు సమాచారం. నితిన్ తో పాటు అతని భార్య, అక్కాబావలు, టాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నీరజ కోనతో పాటు పలువురు.. ఈ పెళ్లికి బస్సు మాట్లాడుకొని మరి వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోని నితిన్ బావ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.


 


Tags:    

Similar News