తండ్రి పైన ఇంత ప్రేమా..?
ఖైదీ నెంబర్ 150 చిత్రంతో నిర్మాతగా మారిన రామ్ చరణ్ తన తండ్రి నటించే సినిమాలన్నీ తానే నిర్మించాలని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీని స్టార్ట్ చేసాడు. మొదటి [more]
ఖైదీ నెంబర్ 150 చిత్రంతో నిర్మాతగా మారిన రామ్ చరణ్ తన తండ్రి నటించే సినిమాలన్నీ తానే నిర్మించాలని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీని స్టార్ట్ చేసాడు. మొదటి [more]
ఖైదీ నెంబర్ 150 చిత్రంతో నిర్మాతగా మారిన రామ్ చరణ్ తన తండ్రి నటించే సినిమాలన్నీ తానే నిర్మించాలని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీని స్టార్ట్ చేసాడు. మొదటి రెండు సినిమాలు తానే నిర్మించి మూడో సినిమాకి మాత్రం సగం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నిజానికి చరణ్.. కొరటాలతో తీసే సినిమా మొత్తం తానే నిర్మించవచ్చు కానీ అప్పటికే మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే సంస్థ వారి దగ్గర కొరటాల డేట్స్ ఉండడంతో ఈ అడ్జస్ట్ మెంట్ జరిగినట్టు సమాచారం.
నిర్మాత కాకపోయినా…
ఈ సినిమాకు ఇద్దరు నిర్మాతలు అయినా కంట్రోల్ మొత్తం చరణే చేయనున్నాడు. ఎందుకంటే తన తండ్రి చేసే ప్రతి సినిమాలోనూ తన జోక్యం ఉంటుందని చరణ్ ఆల్రెడీ చెప్పాడు. అలానే చిరంజీవి – త్రివిక్రమ్ తీసే సినిమాకు చరణ్ నిర్మాత కాదు. దీనికి దానయ్య నిర్మాత. ఈ సినిమా బాధ్యతలు కూడా చరణే చేసుకోనున్నాడు. చిరు రిటైర్ అయ్యే లోగా చిరంజీవితో అన్నీ టాప్ క్లాస్ సినిమాలే తీయాలని చరణ్ ఫిక్స్ అయిపోయాడు. అలా చరణ్ తన సినిమాలతో బిజీగా ఉంటూనే తన తండ్రి చేసే సినిమాల వ్యవహారాలన్నీ తానే చూసుకుంటున్నాడు.