మహర్షి పై వివాస్పదమైన వ్యాఖ్యలు చేసిన వర్మ

మహేష్ బాబు ల్యాండ్ మార్క్ మూవీ మహర్షి అని మహర్షి టీం ఎక్కడికి వెళ్లిన చెప్పుకుంటుంది. కలెక్షన్స్ పరంగా పర్లేదు అనిపించుకున్న ఈసినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ [more]

;

Update: 2019-05-27 08:25 GMT
maharshi movie collections
  • whatsapp icon

మహేష్ బాబు ల్యాండ్ మార్క్ మూవీ మహర్షి అని మహర్షి టీం ఎక్కడికి వెళ్లిన చెప్పుకుంటుంది. కలెక్షన్స్ పరంగా పర్లేదు అనిపించుకున్న ఈసినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు వర్మ ఏదోకటి అనడం కామన్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తనకు గ్రామాలన్నా, పంట పొలాలన్నా పడదని, అందువల్ల తాను రైతుల ఆధారిత కథలను సినిమాలుగా తీయలేను అని అన్నారు. తన సినిమాల్లో సందేశం ఇవ్వాలని కూడా తాను ప్రయత్నించబోనని అన్నారు.

మహర్షి లో మహేష్ బాబు లేకుంటే సినిమాను ఎవరు చూసేవారు అని ఆయన ప్రశించారు. సినీ ప్రేక్షకులు హీరో, పాటలు, కామెడీ సన్నివేశాల కోసమే సినిమాలకు వస్తారని అన్నారు. అయితే మహర్షి ను కేవలం వినోదం కోసమే చూసినా ప్రేక్షకులు బయటకు వచ్చిన తరువాత సినిమాలో సందేశం ఉందని చెబుతున్నారని వర్మ వ్యాఖ్యానించారు. విజయవాడ లో జరిగిన లక్ష్మిస్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేసారు

Tags:    

Similar News