రెడ్ మరో ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ లోని మాస్ కోణాన్ని పూరి బయట పెట్టిన విధానం కన్నా రామ్ పెరఫార్మెన్స్ ఇంకా అదిరింది అనే చెప్పాలి. సాఫ్ట్ గా [more]

Update: 2020-12-24 07:04 GMT

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ లోని మాస్ కోణాన్ని పూరి బయట పెట్టిన విధానం కన్నా రామ్ పెరఫార్మెన్స్ ఇంకా అదిరింది అనే చెప్పాలి. సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనబడే హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ తో మాస్ గా కాదు ఊర మాస్ గా భారీ హిట్ కొట్టాడు. మరి కిషోర్ తిరుమల కూడా ఎప్పుడూ సింపుల్ లవ్ స్టోరీస్ జోనర్ నుండి బయటికి వచ్చి రామ్ ని మాస్ గాను అటు క్లాస్ గాను చూపించాలని డిసైడ్ అయ్యాడు. రామ్ – కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కిన రెడ్ ఎప్పుడో ఎనిమిది నెలల క్రితమే తయారైన సినిమా. సంక్రాంతికి రామ్ రెడ్ విడుదల సన్నాహాలు చేస్తూ ప్రమోషన్స్ లో వేగం పెంచాడు. తాజాగా రామ్ రెడ్ ట్రైలర్ ని విడుదల చేసింది టీం. రెడ్ ట్రైలర్ చూడగానే రామ్ మాస్ లుక్ vs క్లాస్ లుక్ లో అదరగొట్టేసాడు అంటారు.

రెడ్ ట్రైలర్ లో రామ్ మాస్ పాత్రలోనూ, క్లాస్ పాత్రలోనూ రెండు రకాల షేడ్స్ తో చెలరేగిపోయాడు. సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకునే ఆదిత్య ఓ అమ్మాయితో కొంతకాలం ట్రావెల్ అయ్యాక ఆ అమ్మాయి మనకి కరెక్టా కాదా అనేది ఓ డెసిషన్ కి వస్తాం. కానీ ఓ అందమైన అమ్మాయిని చూసి తానే తన డెస్టినీ అని ఫిక్స్ అవుతాడు ఆదిత్య. ప్రొఫెషనల్ గా లైఫ్ లో అంతా సెట్ అయ్యింది అనుకున్న టైం లో ఆదిత్య లా ఉండే మరో రామ్ మాస్ ఎంట్రీ కనిపిస్తుంది రెడ్ ట్రైలర్ లో. లైఫ్ లో సెటిల్ అనుకున్న హీరో లైఫ్ లోకి అచ్చంగా అలానే ఉన్న మ‌రో క్రిమిన‌ల్ ప్ర‌వేశిస్తే ఏం జ‌రుగుతుంద‌న్న‌ది రెడ్ క‌థ లా అనిపిస్తుంది. అయితే ఈ ట్రైలర్ లో క్లాస్ రామ్ కన్నా మాస రామ్ నే ఎలివేట్ చేసారు. అంటే సినిమాలో క్లాస్ vs మాస్ అనేది ఓ క్లారిటీ ఇచ్చేసారు. మాస్ కోణంలో హీరో పాత్ర చూస్తే ఇస్మార్ట్ శంకరే గుర్తొస్తాడు. అలాగే ఓ సాంగ్ లో రామ్ డాన్స్ స్టెప్స్ ఇస్మార్ట్ డాన్స్ గుర్తు చేస్తుంది.

Tags:    

Similar News