రామ్ కరెక్ట్ టైం లోనే రాజకీయాల్లోకి వచ్చాడా?

తెలంగాణాలో  కేసీఆర్ ప్రభుత్వం, ఏపీలో జగన్ సర్కార్ కోవిడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి టెస్ట్ లు చేస్తున్నారో అనే విషయం రోజు ఛానల్స్ లో ప్రసారమవుతూనే [more]

Update: 2020-08-16 07:10 GMT

తెలంగాణాలో  కేసీఆర్ ప్రభుత్వం, ఏపీలో జగన్ సర్కార్ కోవిడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి టెస్ట్ లు చేస్తున్నారో అనే విషయం రోజు ఛానల్స్ లో ప్రసారమవుతూనే ఉంది. కానీ ఏపీలో ఓ క్వారంటైన్ సెంటర్ లో జరిగిన ప్రమాదం మాత్రం అందరిని షాక్ కి గురి చేసింది. పది రోజుల క్రితం ఏపీలోని విజయవాడలోని స్వరం ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో కరోనా పేషేంట్స్ మరణించడంతో.. ఈ ప్రమాదానికి రమేష్ హాస్పిటల్ ఎండి రమేష్ కి సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించి పోలీస్ లు రమేష్ హాస్పిటల్ రమేష్ ని అరెస్ట్ చెయ్యడానికి రెడీ అయ్యేలోపు డాక్టర్ రమేష్ ఎవరికీ కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయడు. అయితే ప్రస్తుతం ఈ కేసుకుని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.

తాజాగా ఈ కేసుపై హీరో రామ్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం అటు ఇండస్ట్రీలోని ఇటు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇది స్వాతంత్ర దినోత్సవమా లేక స్వర్ణా ప్యాలెస్ సంఘటనకు సంబంధించిన రోజా అంటూ మాట్లాడడమే కాదు… ఏపీ సీఎం జగన్ ని అప్రతిష్టపాలు చేసే కుట్ర దాగి ఉందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తూ రామ్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఫైర్ సేఫ్టీ అనేది స్వర్ణ ప్యాలెస్ కి సంబంధించినదే అని..దానితో రమేష్ హాస్పిటల్ కి ఏం సంబంధం అని.. అసలు స్వర్ణ ప్యాలెస్ ని రమేష్ హాస్పిటల్ ని కోవిడ్ సెంటర్ గా మార్చకముందు ప్రభుత్వమే.. అక్కడ కరోనా సెంటర్ నిర్వహించింది. అప్పుడు గనక అగ్నిప్రమాదం జరిగి ఉంటె ఎవరిని నిందించేవాళ్ళు… అంటూ రామ్ చేసిన ట్వీట్ పై ఇప్పుడు వేడి సెగలు రాజుకున్నాయి.

ఎందుకంటే రామ్ రమేష్ కి మేనల్లుడు. రమేష్ రామ్ కి మావయ్య కావడంతోనే రామ్ రమేష్ హాస్పిటల్ ని వెనకేసుకొస్తున్నాడట అంటే.. ఏపీ లో జగన్ ప్రభుకిత్వం తీరు పలు విమర్శలకు తావిస్తున్న టైం లో రామ్ చేసిన ట్వీట్ రాజకీయ రంగు పులుముకుంటుందేమో అంటుంటే.. రామ్ ఇలాంటి టైం లో ట్వీట్ చేసి.. కరెక్ట్ టైం లో రాజకీయాల్లోకి వచ్చాడా అంటున్నారు.

Tags:    

Similar News