రాజమౌళి దాచినా.. నిజం బయటపడింది

ఎప్పుడు కథ పై క్లారిటీ ఇచ్చి తన సినిమాని స్టార్ కాస్ట్ తో పట్టాలెక్కించే రాజమౌళి ఈసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ ల #RRR విషయంలో కథ [more]

Update: 2019-02-10 03:14 GMT

ఎప్పుడు కథ పై క్లారిటీ ఇచ్చి తన సినిమాని స్టార్ కాస్ట్ తో పట్టాలెక్కించే రాజమౌళి ఈసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ ల #RRR విషయంలో కథ దాచేసి.. హీరోయిన్స్ విషయం బయటపెట్టకుండా మీడియా తో దొంగాటాలాడుతున్నాడు. రాజమౌళి చెప్పకపోతేనేమి.. మీడియానే ఇన్వెస్టిగేషన్ చేస్తూ రోజుకో కథ ను #RRR కథ అంటూ కలరింగ్ ఇస్తూ ప్రచారంలోకి తెస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్నదమ్ములుగా… #RRR లో కనబడతారని.. సినిమా మొత్తం 1940 కి సంబందించిన బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ డ్రామా గా ఉండబోతుందని.. ఇలా రకరకాలుగా #RRR కథలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరోపక్క రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా ఎన్టీఆర్ ముస్లిం యువకుడిగా.. ఒక జన్మలో అన్నదమ్ములుగా పుడతారని, మరో జన్మలో స్నేహితులుగా పుడతారని ఇలా రోజుకో కథ బయటికివస్తుంది. అయితే మొదటి షెడ్యూల్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి సెకండ్ షెడ్యూల్ ని గుట్టుగా కానిచ్చేస్తున్న రాజమౌళికి…. ఇప్పుడు ఆయన దాచిన గుట్టు బయటికొచ్చేసింది. కథ విషయంలో క్లారిటీ ఇవ్వని రాజమౌళి.. ఇప్పుడు తానూ చేస్తున్న షూటింగ్ స్పాట్ నుండి లీకైన పిక్స్ ద్వారా తెలియజెప్పేసాడు. నిజం గానే #RRR కథ బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ డ్రామా గా ఉండబోతుందని ఆ లీకెడ్ పిక్స్ తెలియజేస్తున్నాయి. బ్రిటీషర్ల కాలంలో పోలీసుస్టేషన్లు ఎలా వుంటాయో అదే మాదిరిగా ర్ర్ర్ సెట్స్‌కి చెందిన ఫోటోలు కొన్ని ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.

మరి ఆ సెట్ లోని పోలీస్ స్టేషన్, బ్రిటిష్ వారి జెండా ఇలా చూస్తుంటే మీడియాలో #RRR కథ పై వస్తున్న వార్తల్లో నిజం ఉందనిపించడం లేదు. మరి నిజంగానే రామ్ చరణ్ పోలీస్, ఎన్టీఆర్ బందిపోటు అనేది నిజమనిపిస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ కి కాస్త రెస్ట్ ఇచ్చిన రాజమౌళి… చరణ్ తో పోలీస్ స్టేషన్ కి సంబందించిన భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నాడు. మరి రాజమౌళి ఎంతో జాగ్రత్త తీసుకుని #RRR విషయంను గుట్టుగా ఉంచితే.. ఎవరో ఫోన్ లో ఆ సెట్ ఫోటోలు తీసేసి గుట్టు విప్పేసారు.

Tags:    

Similar News