రామ్ చరణ్ రేంజ్ అందుకోలేరా?

రామ్ చరణ్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడా? అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే RRR సినిమా తరవాత తండ్రి చిరు ఆచార్య సినిమాలో నటించాక.. రామ్ చరణ్ తదుపరి [more]

Update: 2020-11-05 04:19 GMT

రామ్ చరణ్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడా? అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే RRR సినిమా తరవాత తండ్రి చిరు ఆచార్య సినిమాలో నటించాక.. రామ్ చరణ్ తదుపరి చిత్రంపై మెగా ఫాన్స్ కె కాదు.. రామ్ చరణ్ కె క్లారిటీ లేదు. రామ్ చరణ్ కి కథలు చెప్పడానికి చాలామంది డైరెక్టర్స్ వచ్చారు.. వెళ్లారు. మధ్యలో రామ్ చరణ్ తనకి కథ చెప్పడానికి వచ్చిన వారిని తండ్రి చిరుకు తగిలించాడనే టాక్ ఉంది. మరి రామ్ చరణ్ కి ఎలాంటి కథ కావాలి. రామ్ చరణ్ RRR తర్వాత ఎలాంటి జోనర్ చేయాలనుకుంటున్నాడు.. అసలు రామ్ చరణ్ రేంజ్ కి టాలీవుడ్ దర్శకులు రీచ్ కాలేకపోతున్నారా.. అంటే నిజం అలానే ఉంది మరి.

RRR లో అల్లూరి పాత్ర చేస్తున్న రామ్ చరణ్ RRR లాంటి పాన్ ఇండియా మూవీ చేసాక మళ్ళీ ఆ లెవెల్ కథే చెయ్యాలని ఫిక్స్ అయినట్లుగా ఉంది వ్యవహారం. అందుకే రామ్ చరణ్ ఆలోచనలాలని ఏ ఒక్క దర్శకుడు అందుకోలేకపోతున్నాడు. రాజమౌళి లాంటి పవర్ ఫుల్ కథ చెప్పే దమ్మున్నోడు కావాలి. లేదా RRR తర్వాత ఏ పాన్ ఇండియా మూవీ అంటే…. బాలీవుడ్ టార్గెట్ చెయ్యబోయే కథతో.. ఏ బాలీవుడ్ డైరెక్టర్ కో సినిమా ఓకే చెప్పాలని రామ్ చరణ్ చూస్తున్నాడా.. రాజమౌళి తో మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ ఆరెంజ్ సినిమా చేసి చేతులు కాల్చుకున్నాడు. అందుకే RRR తరవాత రామ్ చరణ్ మళ్ళీ RRR లాంటి పవర్ ఫుల్ కథకే ఫిక్స్ అయినట్లుగా  కనబడుతున్నాడు. అందుకే ఏ దర్శకుడికి ఓకె చెప్పడం లేదనిపిస్తుంది. 

Tags:    

Similar News