చరణ్ క్రేజ్ కి ఇది పక్కా నిదర్శనం!!
రామ్ చరణ్ ని ఒకప్పుడు ఇతనేం హీరో అన్నవాళ్ళే.. ఇతను స్టార్ హీరో అన్న రేంజ్ కి చేరాడు చరణ్. బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. చరణ్ కష్టపడి పై [more]
రామ్ చరణ్ ని ఒకప్పుడు ఇతనేం హీరో అన్నవాళ్ళే.. ఇతను స్టార్ హీరో అన్న రేంజ్ కి చేరాడు చరణ్. బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. చరణ్ కష్టపడి పై [more]
రామ్ చరణ్ ని ఒకప్పుడు ఇతనేం హీరో అన్నవాళ్ళే.. ఇతను స్టార్ హీరో అన్న రేంజ్ కి చేరాడు చరణ్. బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. చరణ్ కష్టపడి పై కోచ్చిన హీరోనే. లక్కు, క్రేజ్ ఉండాలి కానీ.. బ్యాగ్రౌండ్ ఉంటేనే హీరో అవరు అనేది చరణ్ నిరూపించాడు. చరణ్ కెరీర్ లో మగధీర, ధ్రువ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రకున్నాయి. ఇక వినయ విధేయరామ ప్లాప్ అయినా చరణ్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ RRR లో నటిస్తున్న రామ్ చరణ్ క్రేజ్ సోషల్ మీడియాలో పైపై కి పోతుంది. ఎప్పుడూ ఫేస్ బుక్ లో యాక్టీవ్ గా ఉండే చరణ్ గత మార్చ్ లో ట్విట్టర్ లోకి అడుగుపెట్టాడు. ట్విట్టర్ లోకి అడుగుపెట్టినప్పటినుండి రామ్ చరణ్ క్రేజ్ ని ఆయన అభిమానులు మరింత పెంచేశారు.
కాబట్టే రామ్ చరణ్ ట్విట్టర్ లో ఇప్పుడు ఓ రికార్డుని సెట్ చేసాడు. మెగా అభిమానుల పుణ్యమా అని.. రామ్ చరణ్ ట్విట్టర్ లో 233 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1 మిలియన్ ఫాలోవర్స్ ను రాబట్టుకొని టాలీవుడ్ హీరోల్లో ఏ హీరో సెట్ చెయ్యలేని రికార్డుని చరణ్ సొంతం చేసుకున్నాడు. ట్విట్టర్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్న చరణ్ ఫాస్టెస్ట్ రికార్డుని నెలకొల్పాడు. మరి మెగా హీరో రికార్డు ని సెట్ చేసాడంటే మెగా ఫాన్స్ ఊరుకుంటారా. అప్పుడే సెలెబ్రేషన్స్ స్టార్ట్ కూడా చేసేసారు. ఒకపక్క చిరు కరోనా నుండి కోలుకోవాలని పూజలు చేస్తున్న మెగా ఫాన్స్.. ఇప్పుడు చరణ్ ఫాస్టెస్ట్ రికార్డుని పార్టీలతో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.