శివగామి కోరిక తీరుతుందా?

ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోలందరితో జోడికట్టిన రమ్యకృష్ణ ఇప్పుడు బాహుబలి తర్వాత కూడా మంచి కేరెక్టర్స్ తో దూసుకుపోతుంది. తాజాగా రమ్యకృష్ణ తమిళనాట జయలలిత జీవిత [more]

Update: 2020-05-18 08:30 GMT

ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోలందరితో జోడికట్టిన రమ్యకృష్ణ ఇప్పుడు బాహుబలి తర్వాత కూడా మంచి కేరెక్టర్స్ తో దూసుకుపోతుంది. తాజాగా రమ్యకృష్ణ తమిళనాట జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన క్వీన్ వెబ్ సీరీస్ లో నటించింది. ఈరోజు నుండి జీ తెలుగులో ఆ వెబ్ సిరీస్ ప్రసారం కాబోతుంది. అయితే రమ్యకృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ… ఓ ఆసక్తికర కోరికను బయటపెట్టింది.

తమిళనాట కాకుండా ఓ తెలుగు స్ట్రయిట్ వెబ్ సీరీస్ లో నటించాలని ఉందని…. అది కూడా మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించాలని ఉంది అంటూ.. కోరికను బయటపెట్టింది. మరి ప్రస్తుతం వెబ్ సీరీస్ ల హవా నడుస్తుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా వెబ్ సీరీస్ కి విపరీతమైన ఆదరణ లభించడంతో మున్ముందు వెబ్ సీరీస్ హవా మరింత పెరుగుతున్నట్లే కనబడుతుంది. మరి ఇప్పటికే మెగా ఫ్యామిలీ కూడా వెబ్ సీరీస్ ఆలోచనలు చేస్తుంది అనే టాక్ ఉంది. మరి నిజంగా చిరు కూడా వెబ్ సీరీస్ అంటే అందులో రమ్యకృష్ణ కూడా నటించినా పెద్దగా ఆశ్చర్య పోవక్కర్లేదు. 

Tags:    

Similar News