తండ్రి కాబోతోన్న రానా ? మిహీకా ఏమంటోంది ?

పెళ్లి తర్వాత.. మిహీకా అప్పుడప్పుడూ రానాతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తుంది. అలా ఇటీవల షేర్ చేసిన ఫొటోల్లో ..

Update: 2022-04-01 05:38 GMT

హైదరాబాద్ : టాలీవుడ్ హంక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన రానా దగ్గుబాటి గతేడాది తాను మనసిచ్చిన ప్రేయసి మిహీకా బజాజ్ ను వివాహమాడి బ్యాచిలర్ లైఫ్ కు స్వస్తి చెప్పారు. రానా - మిహీకా ల వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగవైభవంగా జరిగింది. కాగా.. కొద్దిరోజులుగా రానా తండ్రి కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం.. మిహీకా కాస్త బొద్దుగా కనిపించడమే.


పెళ్లి తర్వాత.. మిహీకా అప్పుడప్పుడూ రానాతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తుంది. అలా ఇటీవల షేర్ చేసిన ఫొటోల్లో మిహీకా కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో అభిమానులు మిహికా మీరు తల్లికాబోతున్నారా..? కొంచెం బొద్దుగా కనిపిస్తున్నారు అని అడిగేశారు. అందుకు మిహీకా సమాధానం కూడా ఇచ్చింది. అయ్యో.. అలాంటిదేమీ లేదు. పెళ్లి తర్వాత సాధారణంగా అమ్మాయిల్లో వచ్చే మార్పు మాత్రమే అని, పిల్లల్ని కనేందుకు ఇంకాస్త సమయం ఉందని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం రానా -వెంకటేష్ కాంబినేషన్ లో ఓ వెబ్ సిరీస్ రూపొందుతోంది.






Tags:    

Similar News