రానా ఒక్కడినే నమ్ముకుంటే
బాహుబలి లో భల్లాల దేవుడిగా, రుద్రమదేవిలో రుద్రమదేవిని ఆరాధించే యువకుడిగా.. అదరగొట్టే నటనతో ఆకట్టుకున్న రానా తనకి నచ్చితే ఎలాంటి కేరెక్టర్స్ చెయ్యడానికి అయినా సిద్ధపడుతున్నాడు. హీరోగానే [more]
బాహుబలి లో భల్లాల దేవుడిగా, రుద్రమదేవిలో రుద్రమదేవిని ఆరాధించే యువకుడిగా.. అదరగొట్టే నటనతో ఆకట్టుకున్న రానా తనకి నచ్చితే ఎలాంటి కేరెక్టర్స్ చెయ్యడానికి అయినా సిద్ధపడుతున్నాడు. హీరోగానే [more]
బాహుబలి లో భల్లాల దేవుడిగా, రుద్రమదేవిలో రుద్రమదేవిని ఆరాధించే యువకుడిగా.. అదరగొట్టే నటనతో ఆకట్టుకున్న రానా తనకి నచ్చితే ఎలాంటి కేరెక్టర్స్ చెయ్యడానికి అయినా సిద్ధపడుతున్నాడు. హీరోగానే కాదు, అటు నిర్మాతగానూ రానా కొత్త అవతారమెత్తబోతున్నాడు. ఇక ఓ అన్నంత హీరోగా ఎదగలేకపోయిన రానా… హీరోగా స్టార్ రేంజ్ అందుకోలేకపోయాడు. కానీ బాహుబలి, ఘాజి లాంటి చిత్రాలతో ఇండియా మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గాను పేరు సంపాదించాడు. తాజాగా రానా మీద 200 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నారట. రుద్రమదేవి సినిమా టైం లో దర్శకుడు గుణశేఖర్ హిరణ్య కశ్యప సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. కానీ బడ్జెట్ ప్రోబ్లెంస్ తో ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. తాజాగా ఆ సినిమా త్వరలోనే రానా హీరోగా పట్టాలెక్కబోతుంది.
నిన్నమొన్నటివరకు బడ్జెట్ కారణంగా ఈసినిమా ఆగిపోయిందనే న్యూస్ నడిచింది. కానీ ఈమధ్యన గుణశేఖర్ మా సినిమా హిరణ్య కశ్యప మొదలవబోతుందని ప్రకటించాడు. అయితే సురేష్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా ఉంటుంది కానీ.. సురేష్ బాబు మాత్రం 200 బడ్జెట్ పెట్టడానికి ఒప్పుకోలేదట. 100 కోట్లు పెట్టినా పర్లేదు. రానాకి ఎలాగూ బాలీవుడ్‌లో మార్కెట్ ఉంది కాబట్టి 100 పెట్టిన పర్లేదనుకున్నారట. కానీ గుణశేఖర్ మాత్రం హిరణ్య కశిప బడ్జెట్ ని 200 కోట్లకి చేసేసరికి సురేష్ బాబు ఆలోచనలో పడడంతో ఆ సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదట. అయితే గుణశేఖర్ పట్టువదలని విక్రమార్కుడిలా ట్వంటీయత్ ఫాక్స్ సెంచరీ సంస్థతో చేతులు కలిపి… వాళ్ల సాంకేతిక సహకారం తీసుకుని, వాళ్లనీ నిర్మాణంలో భాగస్వాముల్ని చేసాడట. అయితే సినిమా నాణ్యత కోసం అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నైపుణ్యాన్నివాడాలి. అందుకోసం 200 కోట్ల బడ్జెట్ అవసరం అని గుణశేఖర్ వాదన. కానీ సురేష్ మాత్రం రానా మీద అంత పెట్టడం వెస్ట్ అనుకుని.. ఆలోచిస్తుంటే.. తాజాగా గుణశేఖర్ కూడా నిర్మాతగా హిరణ్యకశిప లో భాగస్వామిగా మారబోతున్నాడట. ఇక సినిమా మీద హైప్ కోసం బాలీవుడ్ స్టార్స్ ని ఎంపిక చెయ్యాలని గుణశేఖర్ భావిస్తున్నాడట మరి ఒక్క రానానే నమ్ముకుంటే పనిజరగదు కనక… ఇలా ఆలోచిస్తున్నారట.