రానా పెళ్లి అలా జరగబోతుందా?

రానా సడన్ గా మెహిక తో న పెళ్లి అది కూడా బాబాయ్ కూతురు ఆశ్రీత బెస్ట్ ఫ్రెండ్ నా లవర్ అంటూ పరిచయం చేసి అందరికి [more]

Update: 2020-06-03 04:25 GMT

రానా సడన్ గా మెహిక తో న పెళ్లి అది కూడా బాబాయ్ కూతురు ఆశ్రీత బెస్ట్ ఫ్రెండ్ నా లవర్ అంటూ పరిచయం చేసి అందరికి షాకిచ్చాడు. అలా ప్రేమ గురించి చెప్పాడో లేదో… ఇలా రోకా ఫంక్షన్. అయితే రానా ఎంగేజ్మెంట్ కానీ, పెళ్లి కానీ ఈ కరోనా కారణంగా ఇప్పట్లో ఉండకపోవచ్చు అని అనుకున్నారు. కానీ ఈ డిసెంబర్ కన్నా ముందే రానా పెళ్లి ఉంటుంది అంటూ వార్తలు రావడం వెంటనే ఆగష్టు లోనే రానా పెళ్లి… దానికి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి అంటున్నారు. సురేష్ ఫ్యామిలీ, మెహిక ఫ్యామిలీ అంతా కలిసి మాట్లాడుకుని పెళ్ళికి ముహుర్తాలు పెట్టించారని అంటున్నారు.

ఆగష్టు 8 న రానా – మెహిక వివాహం అని.. అది కూడా మూడు రోజుల పెళ్లి అని తెలుస్తుంది. ఆగస్టు 8 న పెళ్లి కి ముందు రెండు రోజులు పెళ్లి వేడుకలు ఘనంగా జరగబోతున్నాయని, దగ్గుబాటి కుటుంబం సంప్రదాయం ప్రకారం ఓ పెళ్ళని… అలాగే మెహిక ఫ్యామిలీ మార్వాడీస్ సంప్రదాయం ప్రకారం మరో పెళ్లి అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక రానా కాబోయే భార్య మెహిక ఓ వెడ్డింగ్ ప్లానర్ అట. అందుకే తన పెళ్ళికి సంబందించిన వెడ్డింగ్ ప్లాన్ కూడా మెహికనే తన టీం తో వేస్తుంది. మెహిక ఆలోచనలకు అనుగుణంగా… ప్రత్యేకమైన థీమ్‌తో రానా – మెహిక పెళ్లి వేడుకలు జరగబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ మూడు రోజుల్లో చాలా తక్కువమంది సన్నిహితులు మాత్రమే పెళ్ళికి హాజరవుతారని.. పరిస్థితులు అన్ని అనుకూలిస్తే.. గ్రాండ్ రిసెప్షన్ ని ఇండస్ట్రీకి మొత్తం దగ్గుబాటి ఫ్యామిలీ ఇవ్వబోతుందట.

Tags:    

Similar News