రానా ప్రేమ ముచ్చట్లు?

దగ్గుబాటి వారి మోస్ట్  ఎలిజిబుల్ బ్యాచులర్ రానా ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కుతున్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో హీరోలంతా ఏదో ఒక పని మీద బిజీ గా ఉంటే [more]

Update: 2020-05-24 04:36 GMT

దగ్గుబాటి వారి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రానా ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కుతున్నాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో హీరోలంతా ఏదో ఒక పని మీద బిజీ గా ఉంటే రానా మాత్రం తాను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పడం, వెంటనే రోకా ఫంక్షన్ చేసుకోవడం అందరికి ఒకింత షాకిచ్చింది. ఎందుకంటే రానా ప్రేమలో ఉన్నాడనే విషయం ఎవ్వరికి తెలియదు గనక. గతంలో త్రిష తో లవ్ ఎఫ్ఫైర్ నడిపాడనే టాక్ ఉంది. కాని అందులో నిజమెంతుందో తెలియదు. అయితే తాజాగా రానా మెహిక బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళాడుతున్నా అని చెప్పడం వెంటనే ఓ శుభకార్యం జరగడం జరిగింది. ఆ తర్వాతే రానా లవర్ మెహీక బజాజ్ బ్యాగ్రౌండ్ పై గూగుల్ లో పెద్ద సెర్చింగ్ జరింగింది. అయితే తాజాగా రానా ఫ్రెండ్ మంచు లక్ష్మి రానా ని ఆన్ లైన్ ఇంటర్వ్యూ చెయ్యగా. అందులో మెహిక తో లవ్ ఎలా య్యింది.. ఎలా పెళ్లివరకు వచ్చింది వివరించాడు.

రానా తనకి మెహికా ఎలా పరిచయం అయ్యిందో చెప్పాడు. తన బాబాయ్ వెంకటేష్ కూతురు ఆశ్రీత కి మెహిక క్లాస్ మెట్ అని.. ఆశ్రిత మెహిక మంచి ఫ్రెండ్స్ అని. అలా మెహిక తనకి పరిచయం ఏర్పడింది అని చెబుతున్నాడు రానా. మెహిక ఇల్లు కూడా రానా వాళ్ళ ఇంటికి చాలా దగ్గరేనట. మెహిక ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అట. మెహిక ని చూడగానే మనుసులో ముద్ర వేసింది అని.. చాలా రోజులకి మెహిక తో ఓసారి ఫోన్ మాట్లాడి.. పర్సనల్ గా కలిసి తన ప్రేమ విషయం చెప్పగా… ముందు మెహిక బజాజ్ షాకయినా. తర్వాత తన ప్రేమను ఒప్పుకుంది అని చెప్పాడు. ఇక తనకు మెహికకి ఎంగేజ్మెంట్ అవ్వలేదని.. కేవలం రోకా ఫంక్షన్ మాత్రం జరిగింది అని చెబుతున్నాడు. ఇక మెహిక – తన ప్రేమ ఇంట్లో చెప్పగానే ముందు షాకయినా తర్వాత సంతోషించారని, అసలు ఎప్పుడెప్పుడు పెళ్లి పై గుడ్ న్యూస్ చెబుతానా అని ఫ్యామిలీ మొత్తం ఎదురు చూస్తున్న తరుణంలో నేను ప్రేమ విషయం చెప్పగానే ఒప్పేసుకున్నారని చెబుతున్నాడు రానా.

Tags:    

Similar News