సినిమాల్లోకి వచ్చాక కానీ అర్ధం కాలేదు..ఆసలు విషయం!!

ఇండస్ట్రీలో ఎవరు ఎలా ఉంటారో.. హీరోలు ఇలా ఉంటారు, అలా ఉంటారు. హీరోయిన్స్ ఏం వాడతారు. ఇంత అందంగా ఎలా కనబడతారు అనే క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది. [more]

Update: 2020-08-29 08:31 GMT

ఇండస్ట్రీలో ఎవరు ఎలా ఉంటారో.. హీరోలు ఇలా ఉంటారు, అలా ఉంటారు. హీరోయిన్స్ ఏం వాడతారు. ఇంత అందంగా ఎలా కనబడతారు అనే క్యూరియాసిటీ అందరిలో ఉంటుంది.  చాలామంది హీరోయిన్స్ గా ఇండుస్త్రీకి అడుగుపెట్టకముందు ఇలాంటి క్యూరియాసిటీ ఉన్నవాళ్లే. అదే మాట చెబుతుంది టాలీవుడ్ లక్కీ హీరోయిన్ రష్మిక మందన్న. సినిమాల్లోకి రాకముందు అందరిలాగే నాకు ఓ స్టార్ ఎలా ఉంటారు. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది. ఎమ్ తింటారు.. ఎలా స్లిమ్ గా కనబడుతున్నారు అనే విషయాలను తెలుసుకోవాలనే కోరిక ఉండేది. పేపర్స్, టివి లలో నా అభిమాన హీరో హీరోయిన్స్ విషయాలను చూసినప్పుడు ఆశక్తిగా చదవడం, చూడడం చేసేదాన్ని. 

షూటింగ్స్ కి వెళ్లాలని, చూడాలని ఉండేది కానీ ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు అని చెబుతుంది రష్మిక. అయితే సినిమాల్లోకి అడుగుపెట్టాక కానీ తెలియలేదు. నిజ జీవితం వేరు, సినిమాల్లో లైఫ్ వేరని. సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో నేను చేసే షూటింగ్స్ గురించి, అలాగే నేను కలిసి పనిచేసే హీరోల గురించి నా ఫ్రెండ్స్ అడిగేవారు. నేను కూడా పిచ్చిగా అలా ఇలా అన్ని చెప్పేస్తుండేదాన్ని. కొత్త కాబట్టి ఏవేవో చెప్పేదాన్ని. కానీ తర్వాత అంతా మామూలైపోయింది. నేను నా లైఫ్ లో చూసిన మొట్టమొదటి హీరో హీరోయిన్ కన్నడ హీరో ఉపేంద్ర, కృతి కర్బందా అని చెబుతుంది. తనకు సినిమాల్లోకి రాకముందు సినిమాలంటే ఎంత ఆసక్తిగా ఉండేదో చెప్పుకొచ్చింది రష్మిక.

Tags:    

Similar News