తన యాక్టింగ్ సీక్రెట్ చెప్పిన రష్మిక..!
ఛలో లాంటి యూత్ ఫుల్ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన రష్మిక ఆ తరువాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం చేసి సంచలన విజయాన్ని తన ఖాతాలో [more]
ఛలో లాంటి యూత్ ఫుల్ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన రష్మిక ఆ తరువాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం చేసి సంచలన విజయాన్ని తన ఖాతాలో [more]
ఛలో లాంటి యూత్ ఫుల్ సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన రష్మిక ఆ తరువాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం చేసి సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేస్తుంది. యాక్టింగ్ కూడా చాలా సహజంగా ఉంటుందని మంచి కంప్లీమెంట్స్ అందుకుంటుంది. తాను బయట ఎలాగైతే ఉంటానో కెమెరా ముందు కూడా అలానే ఉంటాను కాబట్టి తన నటన చాలా సహజంగా అనిపిస్తూ ఉంటుందని రష్మిక చెప్పింది.
తెలుగు మాట్లాడుతున్నా…
ఈ మధ్యే తనకు తెలుగు మాట్లాడడం వస్తుందని ఇంతకు ముందు వచ్చేది కాదని, అందుకే సెట్స్ లో ఉన్నప్పుడు అందరికీ తెలుగులోనే మాట్లాడమని చెప్పేదాన్ని అని దాంతో తనకి కూడా తెలుగు మాట్లాడడం అలవాటు అయిందని చెప్పింది. తన స్థాయికి తగ్గ పాత్రలే సెలెక్ట్ చేసుకుంటున్నాని చెప్పింది. ప్రస్తుతం ఈమె డియర్ కామ్రేడ్ తో పాటు మహేష్ – అనిల్ రావిపూడి సినిమాలో నటించనుంది. రష్మికది కన్నడ పరిశ్రమ అయినా తెలుగులో టాప్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది.